IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 సీజన్ శనివారం మొదలవనున్నది. ఈ సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేకంగా గూడుల్‌ను రూపొందించింది. ఈ డూడుల్ అందరినీ ఆకట్టుకుంటున్నది. డూడుల్‌ను క్రికెట్ పిచ్‌గా మార్చి.. రెండు డక్స్ క్రికెడ్ ఆడుతున్నట్లు చూపించింది. ఒక బ్యాట్‌తో బంతిని కొట్టగా.. అంపైర్ తన చేతిని పైకెత్తి నాలుగు పరుగులు ఇవ్వడం కనిపించింది. ఇక డూడుల్‌పై క్లిక్ చేయగానే ఐపీఎల్‌కు సంబంధించిన షెడ్యూల్, జట్ల వివరాలు, మ్యాచుల సమయం సహా ఐపీఎల్‌కు సంబంధించిన వివరాలన్నీ కనిపించాయి.
ఐపీఎల్ 18వ ఎడిషన్ శనివారం నుంచి సుదీర్ఘంగా రెండునెలలకుపైగా కొనసాగనున్నది. డిపెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనున్నది. మెగా టోర్నీలో మొత్తం పది జట్లు పాల్గొంటాయి. 65 రోజుల పాటు 13 వేదికల్లో 74 మ్యాచులు జరుగనున్నాయి. ఇందులో 70 లీగ్ మ్యాచులు, మరో నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచులకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. క్వాలిఫయర్-2, ఫైనల్‌కు కోల్‌కతా వేదిక కానున్నది. మే 25న ఫైనల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్లో జరుగుతుంది.