IPL 2025 | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగిసింది. టైటిల్ గెలిచి తర్వాత భారత జట్టు ఆటగాళ్లు స్వదేశానికి తిరిగి వచ్చారు. ప్రస్తుతం అందరి దృష్టిలో మార్చి 22 నుంచి మొదలయ్యే ఐపీఎల్-2025 సీజన్‌పై ఉన్నది. చాంపియన్స్ ట్రోఫీలో అందరూ భారత జట్టు ప్లేయర్స్ కలిసికట్టుగా ఆడగా.. వారంతా విడిపోయి వారివారి జట్ల తరఫున బరిలోకి దిగనున్నారు. గత సీజన్‌తో పోలిస్తే ఈ సారి చాలాజట్లు కొత్తగా కనిపించనున్నాయి. కొన్ని జట్లు కొత్త కెప్టెన్లు వచ్చారు. కానీ, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఇప్పటి వరకు తమ జట్టు కెప్టెన్ ఎవరు? అన్నది ప్రకటించలేదు. గత సీజన్ వరకు రిషబ్ పంత్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా పని చేశాడు. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ అతని వేలంలో దక్కించుకుంది.
భారత జట్టులో కీలక సభ్యులైన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్.. బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ ఢిల్లీ కెప్టెన్సీ రేసులో ఉన్నారు. రాహుల్ గత సీజన్ వరకు లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా పని చేశాడు. ఈ సారి ఢిల్లీ తరఫున ఆడనున్నాయి. త్వరలోనే ఐపీఎల్ 18వ సీజన్ మొదలు కానున్నది. ఈ క్రమంలో త్వరలోనే ఢిల్లీ ఫ్రాంచైజీ కెప్టెన్‌ని ప్రకటించే అవకాశం ఉందని బావిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి రెండు మ్యాచుల కోసం విశాఖపట్నం వెళ్లే ముందు.. ఢిల్లీలోనే శిక్షణ కమ్ ప్రాక్టీస్ శిబిరాన్ని నిర్వహిస్తుంది. అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, దక్షిణాఫ్రికా ఆటగాడు ట్రిస్టాన్ స్టబ్స్, ఆస్ట్రేలియన్ ప్లేయర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, మిచెల్ స్టార్క్ మార్చి 17-18 తేదీల్లో విశాఖపట్నంలో జట్టుతో చేరుతారు. రాహుల్ భార్య అతియాశెట్టి త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రారంభ సమయంలోనే రాహుల్ కుటుంబంలోకి కొత్త సభ్యుడు చేరనున్న క్రమంలో.. ఐపీఎల్లో కొటి, రెండు మ్యాచులకు దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రేసులో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ముందున్నాడు. రాహుల్ కంటే అతనికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్షర్ 150 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. దాదాపు 131 స్ట్రయిక్ రేట్‌తో 1,653 పరుగులు చేశాడు. 7.28 ఎకానమీ రేట్‌తో 123 వికెట్లు పడగొట్టాడు. అయితే, రాహుల్ గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. గతంలోనూ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌కు నాయకత్వం వహించిన అనుభవం ఉన్నది. రాహుల్ కెప్టెన్సీలో లక్నో జట్టు రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఇక రాహుల్.. 134 కంటే ఎక్కువ స్ట్రయిక్ రేట్‌తో 4,683 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి.
Dhanashree Verma | మహిళలను నిందించడం ఫ్యాషనైపోయింది.. ధనశ్రీవర్మ పోస్ట్ వైరల్