KKR vs RCB | చావో రేవో అన్నట్లుగా మారిన మ్యాచ్‌లో బెంగళూరుకు ఆదిలోనే షాక్ తగిలింది. మూడో ఓవర్లో మొదటి బంతికే విరాట్ కోహ్లీ (18) ఔటయ్యాడు. హర్షిత్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చాడు. దీనిపై కోహ్లీ రివ్యూ తీసుకున్నప్పటికీ ఔట్‌గానే తేలింది. దీంతో అసహనంగా కోహ్లీ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.