GT vs DC | గుజరాత్ బ్యాటర్లకు ఢిల్లీ ముచ్చెమటలు పట్టిస్తోంది. వరుసగా వికెట్లు తీస్తూ టెన్షన్ పెట్టిస్తోంది. ఢిల్లీ బ్యాటర్ల ధాటికి 66 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయింది. 12వ ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియా (10) ఔటయ్యాడు. అంతకుముందు వికెట్ కీపింగ్‌తో అదరగొట్టిన రిషబ్ పంత్ మూడు వికెట్లు తీశాడు. స్టబ్స్ వేసిన తొమ్మిదో ఓవర్లో షారుక్‌ఖాన్(0), అభినవ్ మనోహర్ (8)ను స్టంప్ ఔట్ చేశాడు. ఇషాంత్ శర్మ వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి రిషబ్ పంత్ అద్భుతంగా డ్రైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు.
అంతకుముందు రెండో ఓవర్లో ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి.. శుభ్‌మన్ గిల్ (8) ఔటయ్యాడు. ఆతర్వాత నాలుగో ఓవర్ ఐదో బంతికి వృద్ధిమాన్ సాహా(2).. ఔటవ్వగా.. ఐదో ఓవర్లో మొదటి బంతికి సాయి సుదర్శన్ (12) పెవిలియన్ చేరాడు. 12 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ ఏడు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.