GT vs DC | చిత్తుగా ఓడిన గుజరాత్.. 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం
GT vs DC | నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్‌ను ఢిల్లీ మట్టికరిపించింది. ముందుగా బౌలింగ్ ధాటితో కుప్పకూల్చిన ఢిల్లీ.. ఆ తర్వాత అవలీలగా టార్గెట్‌ను చేధించింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
GT vs DC | నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్‌ను ఢిల్లీ మట్టికరిపించింది. ముందుగా బౌలింగ్ ధాటితో కుప్పకూల్చిన ఢిల్లీ.. ఆ తర్వాత అవలీలగా టార్గెట్‌ను చేధించింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభం నుంచే ఢిల్లీ షాకులు ఇస్తూ వచ్చింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాటర్లు చతికిలబడ్డారు. ఎవ్వరూ కూడా చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. ఒక్క రషీద్ ఖాన్ (31) మాత్రమే జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. కానీ అప్పటికే జట్టు మొత్తం విఫలం కావడంతో 89 పరుగుల వద్దనే గుజరాత్ ఆగిపోయింది. దీంతో 90 పరుగుల అత్యల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాటర్లు మధ్యలో తడబడినప్పటికీ 8.5 ఓవర్లలోనే అవలీలగానే టార్గెట్‌ను చేధించారు.
గుజరాత్ ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్లోనే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (8) ఔటవ్వగా.. నాలుగో ఓవర్లో ఐదో బంతికి మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో ఓవర్లో మొదటి బంతికి సాయి సుదర్శన్ (12) రనౌటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డేవిడ్ మిల్డర్ (2) కూడా రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తొమ్మిదో ఓవర్లో అభినవ్ మనోహర్ (8), షారుక్ ఖాన్ (0)ను రిషబ్ పంత్ స్టంపౌట్ చేశాడు. 12వ ఓవర్లో రెండో బంతికి రాహుల్ తెవాటియా (10) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 15వ ఓవర్లో చివరి బంతికి మోహిత్ శర్మ (2).. సుమిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. 18వ ఓవర్లో మొదటి బంతికే రషీద్ ఖాన్ (31) పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్ వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. ఫలితంగా 17.3 ఓవర్ల వద్ద 89 పరుగులకే గుజరాత్ ఆలౌట్ అయ్యింది.
అత్యల్ప టార్గెట్‌ను చేధించేందుకు క్రీజులోకి ముందుగా వచ్చిన జెక్ ఫ్రేజర్ (20) దూకుడుగా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. అతనికి పృథ్వీ షా ( 7) తోడయ్యాడు. కానీ జెక్ ఫ్రేజర్ దూకుడుకు స్పెన్సర్ జాన్సన్ చెక్ పెట్టాడు. ఫ్రేజర్ ఔటయిన కాసేపటికే పృథ్వీ షా కూడా పెవిలియన్‌కు పంపించారు. ఆ తర్వాత కాసేపటికే గుజరాత్ బౌలర్లు అభిషేక్ పొరెల్ (15 ), షై హోప్ (19) వికెట్లను తీసి ఢిల్లీని టెన్షన్ పెట్టాలని అనుకున్నారు. కానీ రిషబ్ పంత్(16), సుమిత్ కుమార్ (9) నిలకడగా ఆడుతూ టార్గెట్‌ను చేధించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | దీక్షా దివాస్‌ను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఎన్నారై శాఖలన్నీ సిద్ధం కావాలి : మహేష్ బిగాల
Sweets | పండుగల సమయంలో స్వీట్లు, ఇతర ఆహారాలను అధికంగా తినొద్దంటే.. ఇలా చేయాలి..
Mahabubabad | మహబూబాబాద్ యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురి అరెస్ట్
Telugu Youth | ఆస్ట్రేలియాలో తెలుగు యువకుడు అస్రిత్ దేవళ్ల ప్రతిభకు ప్రతిష్ఠాత్మక అవార్డు
Brakes fail Vande Bharat travels | బ్రైక్స్ ఫెయిల్ అయిన వందే భారత్ రైలు 463 కిలోమీటర్లు ప్రయాణం.. దర్యాప్తునకు రైల్వే ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

