GT vs DC | స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ తొలి వికెట్‌ను కోల్పోయింది. రెండో ఓవర్ చివరి బంతికి జేక్ ఫ్రేజర్ (20) ఔటయ్యాడు. స్పెన్సర్ జాన్సన్ వేసిన బంతికి అభినవ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం పృథ్వీ షా క్రీజులో ఉన్నాడు.
అంతకుముందు ఢిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్ కుప్పకూలింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాటర్లు చతికిలబడ్డారు. ఎవ్వరూ కూడా చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. ఒక్క రషీద్ ఖాన్ (31) మాత్రమే జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. కానీ అప్పటికే జట్టు మొత్తం విఫలం కావడంతో 89 పరుగుల వద్దనే గుజరాత్ ఆగిపోయింది.