IPL 2023 | ఐపీఎల్ 16వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. వరుస పరాజయాలకు ముగింపు పలికింది. సొంతగడ్డపై చెలరేగిన మర్క్రం సేన పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో నెగ్గింది. రాహుల్ త్రిపాఠి(74) ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు. కెప్టెన్ మర్క్రం(37) అజేయంగా నిలిచాడు. వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ కొట్టాలనుకున్న పంజాబ్‌కు నిరాశే మిగిలింది.
ఐపీఎల్ 16వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. వరుస పరాజయాలకు ముగింపు పలికింది. సొంతగడ్డపై చెలరేగిన మర్క్రం సేన పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో నెగ్గింది. రాహుల్ త్రిపాఠి(74) ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు. కెప్టెన్ మర్క్రం(37) అజేయంగా నిలిచాడు. వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ కొట్టాలనుకున్న పంజాబ్‌కు నిరాశే మిగిలింది.
Fifty partnership up between @AidzMarkram & Rahul Tripathi!@SunRisers need 26 off the final five now ✅
Follow the match ▶️ https://t.co/Di3djWhVcZ#TATAIPL | #SRHvPBKS pic.twitter.com/E3Qy9CfTfq
— IndianPremierLeague (@IPL) April 9, 2023
సామ్ కరన్ వేసిన 16వ ఓవర్లో 6 రన్స్ వచ్చాయంతే. రాహుల్ త్రిపాఠి (69), మర్క్రం (21) క్రీజులో ఉన్నారు. 16 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 124/2. హైదరాబాద్ విజయానికి 24 బంతుల్లో 20 రన్స్ కావాలి.
Picked beautifully and launched out of the ground 💥@SunRisers fans, what do you make of Rahul Tripathi's confidence with the bat tonight? 😎
Follow the match ▶️ https://t.co/Di3djWhVcZ#TATAIPL | #SRHvPBKS pic.twitter.com/621Y49Ri4w
— IndianPremierLeague (@IPL) April 9, 2023
మోహిత్ రథీ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి (65) వరుసగా సిక్స్, రెండు ఫోర్లు కొట్టాడు. మర్క్రం (19) ఒక బౌండరీ బాదాడు. దాంతో, 21 రన్స్ వచ్చాయి. 15 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 118/2
రాహుల్ త్రిపాఠి (50) హాఫ్ సెంచరీ కొట్టాడు. మోహిత్ రథీ ఓవర్లో సిక్సర్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మర్క్రం (10) క్రీజులో ఉన్నాడు. 13 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 94/2
That's a quality half-century by Rahul Tripathi 👏👏
He has kept @SunRisers in control in the chase as they require 50 off 42 now!
Who will get the breakthrough for #PBKS?
Follow the match ▶️ https://t.co/Di3djWhVcZ#TATAIPL | #SRHvPBKS pic.twitter.com/nxhZpHsbmC
— IndianPremierLeague (@IPL) April 9, 2023
నాథన్ ఎల్లిస్ ఓవర్లో8 రన్స్ వచ్చాయి. మర్క్రం (9) ఒక బౌండరీ కొట్టాడు. రాహుల్ త్రిపాఠి(43) క్రీజులో ఉన్నాడు. 12 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 86/2
హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి(31) రెచ్చిపోయాడు. వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. దాంతో, 13 రన్స్ వచ్చాయి. మర్క్రం (3) క్రీజులో ఉన్నాడు. 10 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 68/2
హైదరాబాద్ రెండో వికెట్ పడింది. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్(21) ఔటయ్యాడు. బౌండరీ దగ్గర సామ్ కరన్ క్యాచ్ పట్టడంతో మయాంక్ వెనుదిరిగాడు. రాహుల్ త్రిపాఠి(11) క్రీజులో ఉన్నారు. 8.3 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్..45/2
8 ఓవర్లకు హైదరాబాద్ 43 రన్స్ చేసింది. రాహుల్ త్రిపాఠి(10), మయాంక్ అగర్వాల్(20) క్రీజులో ఉన్నారు.
పవర్ ప్లేలో హైదరాబాద్ వికెట్ నష్టానికి 34 రన్స్ చేసింది. మయాంక్ అగర్వాల్(18), రాహుల్ త్రిపాఠి(3) క్రీజులో ఉన్నారు.
హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన నాలుగో ఓవర్లో హ్యారీ బ్రూక్(13) బౌల్డ్ అయ్యాడు. వరుసగా రెండు ఫోర్లు బాదిన అతను ఐదో బంతికి వికెట్ సమర్పించుకున్నాడు. మయాంక్ అగర్వాల్(14) క్రీజులో ఉన్నాడు.
End of Powerplay!
A wicket for @PunjabKingsIPL as @arshdeepsinghh dismissed Harry Brook.
3⃣4⃣ runs for @SunRisers in the first six overs, with @mayankcricket & @rahultripathi in the middle.
Follow the match 👉 https://t.co/Di3djWhVcZ #TATAIPL | #SRHvPBKS pic.twitter.com/Kxqn8gqoTT
— IndianPremierLeague (@IPL) April 9, 2023
అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండ ఓవర్లో మయాంక్ అగర్వాల్(9) రెండు ఫోర్లు బాదాడు. హ్యారీ బ్రూక్(4) క్రీజులో ఉన్నాడు. 2 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 13/0
సామ్ కరన్ వేసిన మొదటి ఓవర్ తొలి బంతికే ఓపెనర్ హ్యారీ బ్రూక్(4) ఫోర్ కొట్టాడు. మయాంక్ అగర్వాల్(0) క్రీజులో ఉన్నాడు.
పంజాబ్ కింగ్స్ 143 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (91) అర్ధ సెంచరీతో చెలరేగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఒంటరి పోరాటం చేసిన అతను సిక్స్‌లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఉమ్రాన్, భువనేశ్వర్ బౌలింగ్‌లో ధాటిగా ఆడి స్కోర్ 140 దాటించాడు. మోహిత్ రథీ(1)తో కలిసి ఆఖరి వికెట్‌కు 55 రన్స్ జోడించాడు. హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే నాలుగు వికెట్లు తీశాడు. మార్కో జాన్సేన్, ఉమ్రాన్ మాలిక్ తలా రెండు వికెట్లు కూల్చారు. భువనేశ్వర్ కుమార్‌కు ఒక వికెట్ దక్కింది.
FIFTY for @PunjabKingsIPL captain @SDhawan25! 👏 👏
This has been a fine knock 👌👌
Follow the match 👉 https://t.co/Di3djWhVcZ #TATAIPL | #SRHvPBKS pic.twitter.com/8wu0jhiAne
— IndianPremierLeague (@IPL) April 9, 2023
18 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ పరుగులు చేసింది. హాఫ్ సెంచరీ కొట్టిన శిఖర్ ధావన్ (82) సిక్స్‌లతో స్కోర్ బోర్డు వేగం పెంచాడు. ఉమ్రాన్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, బౌండరీ కొట్టాడు. దాంతో, 17 రన్స్ వచ్చాయి. మోహిత్ రథీ(1) క్రీజులో ఉన్నాడు.
ఒంటరి పోరాటం చేస్తున్న శిఖర్ ధావన్ (53) హాఫ్ సెంచరీ బాదాడు. నటరాజన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో యాభై రన్స్ చేశాడు.
పంజాబ్ కింగ్స్ ఆలౌట్ ప్రమాదంలో పడింది. మయాంక్ మార్కండే వేసిన 15వ ఓవర్లోనాథన్ ఎల్లిస్ బౌల్డ్ కావడంతో తొమ్మిదో వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ (47) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 15 ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 88/9
ఓ వైపు వికెట్లు టపాటపా పడిపోతున్న పంజాబ్ కింగ్స్ సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఒంటరిపోరాటం చేస్తున్నాడు. ఇప్పటి వరకు 33 బంతులు ఆడి 42 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 14 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు స్కోర్ 83/8
పంజాబ్ మరో వికెట్ కోల్పోయింది. రాహుల్ చాహర్ డకౌట్ అయ్యాడు. మార్కండే బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 13 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోర్ 78/8
హైదరాబాద్ బౌలర్ల ధాటికి పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. 11.2 ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో హర్‌ప్రీత్ బ్రార్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 11.2 ఓవర్లకు పంజాబ్ 77 పరుగులు చేసింది.
హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మరో వికెట్‌ను కోల్పోయింది. 74 పరుగుల వద్ద షారుఖ్ ఖాన్ (4) వికెట్ కోల్పోయి పీకలోతు కష్టాల్లో ఉన్నది. మయాంక్ మార్కండే బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు మరో ఎండ్‌లో శిఖర్ ధావన్ 34 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
పంజాబ్ కింగ్స్ మరింత కష్టాల్లో పడింది. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ సికిందర్ రజా(5) ఔటయ్యాడు. బౌండరీ వద్ద మయాంక్ అగర్వాల్ క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. శిఖర్ ధావన్ (33), షారుక్ ఖాన్(4) క్రీజులో ఉన్నారు. పది ఓవర్లకు పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.
64 పరుగులకే నాలుగు వికెట్లు పడడంతో పంజాబ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా సికిందర్ రజాను తీసుకుంది. ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్ స్థానంలో అతడు మైదానంలోకి వచ్చాడు.
పంజాబ్ కింగ్స్ బిగ్ వికెట్ కోల్పోయింది. మయాంక్ మార్కండే ఓవర్లో సామ్ కరన్(22) ఔటయ్యాడు. గూగ్లీ బంతిని థర్డ్ మ్యాన్ దిశగా షాట్ ఆడిన సామ్, భువనేశ్వర్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దాంతో, 41 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. శిఖర్ ధావన్ (33) క్రీజులో ఉన్నాడు. 8.5వ ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 63/4.
నటరాజన్ వేసిన 8వ ఓవర్లో శిఖర్ ధావన్ (32) చెలరేగాడు. రెండు ఫోర్లు కొట్టాడు. సామ్ కరన్(18) క్రీజులో ఉన్నాడు. తొ 8వ ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 58/3.
మార్కో జాన్సేన్ వేసిన ఆరో ఓవర్ సామ్ కరన్(12) చెలరేగాడు. తొలి బంతికి సిక్స్, రెండో బంతికి ఫోర బాదాడు. శిఖర్ ధావన్ (21) క్రీజులోకి ఉన్నాడు. పవర్ ప్లేలో పంజాబ్ స్కోర్.. 41/3.
మార్కో జాన్సేన్ మరోసారి చెలరేగాడు. జితేశ్ శర్మ(4)ను ఔట్ చేసి రెండో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. మిడాన్‌లో మర్క్రం క్యాచ్ పట్టడంతో జితేశ్ ఔటయ్యాడు. సామ్ కరన్ క్రీజులోకి వచ్చాడు. శిఖర్ ధావన్ 14 పరుగులతో ఆడుతున్నాడు. 4 ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 22/3.
2⃣nd success with the ball for Marco Jansen! 👏 👏#PBKS 3 down as Jitesh Sharma departs!
Follow the match 👉 https://t.co/Di3djWhVcZ #TATAIPL | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/gynG4CLXVA
— IndianPremierLeague (@IPL) April 9, 2023
పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. మార్కో జాన్సేన్ వేసిన రెండో ఓవర్లో మాథ్యూ షార్ట్(1) ఎల్బీగా ఔటయ్యాడు. దాంతో, 10 పరుగుల వద్ద ఆ జట్టు రెండో వికెట్ పడింది. శిఖర్ ధావన్(6), జితేశ్ శర్మ(4) క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు షాక్.. మొదటి ఓవర్ తొలి బంతికే భువనేశ్వర్ వికెట్ తీశాడు. ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్(0) ఎల్బీగా వెనుదిరిగాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచింది. కెప్టెన్ మర్క్రం ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో, పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.