IPL 2023 : ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 14 పరగులు తేడాతో గెలిచింది. కామెరూన్ గ్రీన్(64) వీర బాదుడుకు ఇషాన్ కిషన్(38), తిలక్ వర్మ(37) మెరుపులు తోడవ్వడంతో ముంబై భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత ప్రత్యర్థిని 178 పరుగులకు ఆలౌట్ చేసింది. మయాంక్ అగర్వాల్(48), హెన్రిచ్ క్లాసెన్(36) ధాటిగా ఆడినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దాంతో, హైదరాబాద్ ఓటమి పాలైంది. ముంబై బౌలర్లలో రిలే మెరిడిత్, జాసన్ బెహ్రన్‌డార్ఫ్, పీయూష్ చావ్లా తలా రెండు వికెట్లు తీశారు. అర్జున్ టెండూల్కర్, కామెరూన్ గ్రీన్ ఒక వికెట్ పడగొట్టాడు.
ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 14 పరగులు తేడాతో గెలిచింది. కామెరూన్ గ్రీన్(64) వీర బాదుడుకు ఇషాన్ కిషన్(38), తిలక్ వర్మ(37) మెరుపులు తోడవ్వడంతో ముంబై భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత ప్రత్యర్థిని 178 పరుగులకు ఆలౌట్ చేసింది. మయాంక్ అగర్వాల్(48), హెన్రిచ్ క్లాసెన్(36) ధాటిగా ఆడినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దాంతో, హైదరాబాద్ ఓటమి పాలైంది.
బెహ్రన్‌డార్ఫ్ వేసిన 18వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ (10) రనౌటయ్యాడు. తొలి బంతికి, నాలుగో బంతికి అతను ఫోర్ కొట్టాడు. ఐదో బంతికి ఐవడ్ రూపంలో 5 రన్స్ వచ్చాయి. ఇంపాక్ట్ ప్లేయర్ అబ్దుల్ సమద్(4) క్రీజులో ఉన్నాడు.
హైదరాబాద్ ఏడో వికెట్ పడింది మెరిడిత్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన జాన్సెన్(13) టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
హైదరాబాద్ 16 ఓవర్లకు 143 పరుగులు చేసింది. గ్రీన్ బౌలింగ్‌లో జాన్సెన్(9) రెండు ఫోర్లు బాదాడు. ఇంపాక్ట్ ప్లేయర్ అబ్దుల్ సమద్(2) క్రీజులో ఉన్నాడు.
హైదరాబాద్ ఆరో వికెట్ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్(48) గ్రీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మయాంక్ కొట్టిన బంతిని టిమ్ డేవిడ్ బౌండరీ వద్ద అందుకున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ అబ్దుల్ సమద్(1) క్రీజులో ఉన్నాడు. 14.5 ఓవర్లకు స్కోర్..132/6. హైదరాబాద్ విజయానికి 31 బంతుల్లో 61 పరుగులు కావాలి.
దంచి కొడుతున్నహెన్రిచ్ క్లాసెన్(36) ఔటయ్యాడు. చావ్లా వేసిన 14వ ఓవర్లో స్వీప్ షాట్లతో రెండు ఫోర్లు కొట్టాడు. లాంగాఫ్‌లో భారీ సిక్స్ బాదాడు. ఆ తర్వాత బంతికి భారీ షాట్ ఆడి ఔటయ్యాడు. మయాంక్ అగర్వాల్(46) ఆడుతున్నాడు. 14 ఓవర్లకు స్కోర్..127/5. హైదరాబాద్ విజయానికి 36 బంతుల్లో 66 పరుగులు కావాలి.
గ్రీన్ వేసిన 13వ ఓవర్లో హెన్రిచ్ క్లాసెన్(16) బౌండరీ కొట్టాడు. దాంతో, హైదరాబాద్ స్కోర్ వంద దాటింది. మయాంక్ అగర్వాల్(45) ఆడుతున్నాడు. 13 ఓవర్లకు స్కోర్..106/4
ఒకవైపు వికెట్లు పడుతున్నా మయాంక్ అగర్వాల్(44) బాదుతున్నాడు. పీయూష్ చావ్లా వేసిన 12వ ఓవర్ బౌండరీ కొట్టాడు. హెన్రిచ్ క్లాసెన్(8) ఆడుతున్నాడు. 12 ఓవర్లకు స్కోర్.. 96/4
హైదరాబాద్ కష్టాల్లో పడింది. స్వల్ప వ్యవధిలో నాలుగో వికెట్ కోల్పోయింది. పీయూష్ చావ్లా వేసిన 10వ ఓవర్ మొదటి బంతికి అభిషేక్ శర్మ(1) ఔటయ్యాడు. దాంతో, 72 రన్స్‌కే కీలక వికెట్లు పడ్డాయి. మయాంక్ అగర్వాల్(30), హెన్రిచ్ క్లాసెన్(1) ఆడుతున్నారు. 10 ఓవర్లకు స్కోర్.. 76/4
హైదరాబాద్ మూడో వికెడ్ పడింది. కెప్టెన్ మరక్రం(22) కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మయాంక్ అగర్వాల్(29), అభిషేక్ శర్మ(1) క్రీజులో ఉన్నారు.
మయాంక్ అగర్వాల్(28) బాదుతున్నాడు. పీయూష్ చావ్లా వేసిన 8వ ఓవర్లో బౌలర్ తల మీదుగా బౌండరీ కొట్టాడు. 10 రన్స్ వచ్చాయి. కెప్టెన్ మరక్రం(17) క్రీజులో ఉన్నాడు. 8 ఓవర్లకు స్కోర్.. 64/2
మయాంక్ అగర్వాల్(19) బాదుతున్నాడు. బెహ్రన్‌డార్ఫ్ వేసిన ఐదో ఓవర్లో బౌండరీ కొట్టాడు. 7 రన్స్ వచ్చాయి.కెప్టెన్ మరక్రం(4) క్రీజులో ఉన్నాడు. 6 ఓవర్లకు స్కోర్.. 42/2
మయాంక్ అగర్వాల్(14) జోరు పెంచాడు. రిలే మెరిడిత్ వేసిన ఐదో మూడో ఓవర్లో భారీ సిక్స్ కొట్టాడు. 9 రన్స్ వచ్చాయి.కెప్టెన్ మరక్రం(2) క్రీజులో ఉన్నాడు. ఐదు ఓవర్లకు స్కోర్..35/2
జాసన్ బెహ్రన్‌డార్ఫ్ మరోసారి చెలరేగాడు. రాహుల్ త్రిపాఠి(7)ని ఔట్ చేశాడు. కీపర్ ఇషాన్ క్యాచ్ పట్టడంతో త్రిపాఠి వెనుదిరిగాడు. మయాంక్ అగర్వాల్(6) క్రీజులో ఉన్నాడు.
అర్జున్ టెండూల్కర్ వేసిన మూడో ఓవర్లో రెండు వైడ్స్ వేశాడు.ఆఖరి బంతికి రాహుల్ త్రిపాఠి(6) ఫోర్ బాదాడు. 9రన్స్ వచ్చాయి. మయాంక్ అగర్వాల్(4), .. క్రీజులో ఉన్నాడు. మూడు ఓవర్లకు స్కోర్.. 22/1
జాసన్ బెహ్రన్‌డార్ఫ్ బిగ్ వికెట్ తీశాడు. ఓపెనర్ హ్యారీ బ్రూక్(9)ని ఔట్ చేశాడు. రెండో బంతికి బౌండరీ కొట్టిన బ్రూక్ మూడో బంతిని గాల్లోకి లేపాడు. సుర్యకుమార్ చక్కని క్యాచ్ పట్టడంతో 11 రన్స్ వద్ద హైదరాబాద్ తొలి వికెట్ పడింది.
Jason Behrendorff gets the big wicket of Harry Brook 💪💪
Live - https://t.co/oWfswiuqls #TATAIPL #SRHvMI #IPL2023 pic.twitter.com/dOIiym6MST
— IndianPremierLeague (@IPL) April 18, 2023
అర్జున్ టెండూల్కర్ వేసిన తొలి ఓవర్లో హ్యారీ బ్రూక్(5) ఫోర్ బాదాడు. 6 రన్స్ వచ్చాయి. మయాంక్ అగర్వాల్(1) క్రీజులో ఉన్నాడు.
ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. నాలుగు మ్యాచుల్లో విఫలమైన కామెరూన్ గ్రీన్(64) అర్ధ శతకంతో చెలరేగాడు. దాంతో, ముంబై 192 రన్స్ చేసింది. గ్రీన్, టిమ్ డేవిడ్(16) ఆఖర్లో ధాటిగా ఆడడంతో ముంబై భారీ స్కోర్ చేయగలిగింది.
Innings Break!#MumbaiIndians post a formidable total of 192/5 on the board.#SRH chase coming up shortly. Stay tuned!
Scorecard - https://t.co/oWfswiuqls #TATAIPL #SRHvMI #IPL2023 pic.twitter.com/C7TfCDGbsE
— IndianPremierLeague (@IPL) April 18, 2023
టాస్ ఓడిన ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ(28), ఇషాన్ కిషన్(38) ధాటిగా ఇన్నింగ్స్ మొదలెట్టారు. దంచికొడుతున్నరోహిత్ను ఔట్ చేసి నటరాజన్ హైదరాబాద్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇషాన్, గ్రీన్ ఆచితూచి ఆడారు. జాన్సెన్ ఒకే ఓవర్లో ఇషాన్, సూర్యకుమార్(7)ను ఔట్ చేసి ముంబైని దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ(37) సిక్స్‌లతో చెలరేగాడు. నటరాజన్ బౌలింగ్‌లో గ్రీన్ హ్యాట్రిక్ ఫోర్లు బాది యాభై పూర్తి చేసుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, భువనేశ్వర్, నటరాజన్ తలా ఒక వికెట్ తీశారు.
కామెరూన్ గ్రీన్(51) ఐపీఎల్లో తొలి హాఫ్ సెంచరీ కొట్టాడు. నటరాజన్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాది యాభై పూర్తి చేసుకున్నాడు.
ముంబై నాలుగో వికెట్ పడింది. ధాటిగా ఆడుతున్న తిలక్ వర్మ(37) ఔటయ్యాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన అతను తర్వాతి బంతికి భారీ షాట్ ఆడాడు. మయాంక్ అగర్వాల్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు.
16 ఓవర్లకు ముంబై 3 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్(38), తిలక్ వర్మ(31) క్రీజులో ఉన్నారు.
ముంబై రెండో వికెట్ కోల్పోయింది. డేంజరస్ ఇషాన్ కిషన్(38) ఔటయ్యాడు. జాన్స్‌న్ బౌలింగ్‌లో మర్క్రం క్యాచ్ పట్టడంతో అతను పెవిలియన్ బాట పట్టాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు.
ఇషాన్ కిషన్(35) బాదుతున్నాడు. మార్కండే వేసిన 10వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. కామెరూన్ గ్రీన్(16) క్రీజులో ఉన్నాడు. 10 ఓవర్లకు స్కోర్..80/1
వాషింగ్టన్ సుందర్ వేసిన 9వ ఓవర్ ఆఖరి బంతికి కామెరూన్ గ్రీన్(15) సిక్స్ బాదాడు. ఇషాన్ కిషన్(25) క్రీజులో ఉన్నాడు. 9 ఓవర్లకు స్కోర్.. 69/1
స్పిన్నర్లను దించడంతో ముంబై స్కోర్ వేగం తగ్గింది. ఇషాన్ కిషన్(24) మయాంక్ మార్కండే బౌలింగ్‌లో 4 రన్స్ వచ్చాయంతే. కామెరూన్ గ్రీన్(7)క్రీజులో ఉన్నాడు. 8 ఓవర్లకు స్కోర్.. 60/1
ఇషాన్ కిషన్(21) వేగం పెంచాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో సిక్స్ బాదాడు. దాంతో ముంబై స్కోర్ యాభై దాటింది. కామెరూన్ గ్రీన్(3 )క్రీజులో ఉన్నాడు. పవర్ ప్లేలో స్కోర్.. 53/1
ముంబై తొలి వికెట్ పడింది. దంచికొడుతున్న రోహిత్ శర్మ(28) నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మూడో బంతికి స్కూప్ షాట్‌తో బౌండరీ కొట్టిన అతను నాలుగో బంతికి మరక్రం క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు.
T Natarajan gets the first breakthrough and the big wicket of Rohit Sharma, who departs after scoring 28 runs.
Live - https://t.co/oWfswiuqls #TATAIPL #SRHvMI #IPL2023 pic.twitter.com/Wqc4gdqUKY
— IndianPremierLeague (@IPL) April 18, 2023
రోహిత్ శర్మ(19) దంచుతున్నాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన మూడో ఓవర్లో రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లు బాదాడు. దాంతో, ఐపీఎల్లో 6 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి బంతికి ఇషాన్ కిషన్(8) సింగిల్ తీశాడు. మూడు ఓవర్లకు స్కోర్.. 28/0
Milestone 🚨 - 6000 runs and counting for @ImRo45 in #TATAIPL
Keep going, Hitman 💪💪#SRHvMI pic.twitter.com/VQeYRWivwb
— IndianPremierLeague (@IPL) April 18, 2023
జాన్సెన్ వేసిన రెండో ఓవర్ ఆఖరి బంతికి ఇషాన్ కిషన్(8) సిక్స్ కొట్టాడు. దాంతో, 9 రన్స్ వచ్చాయి. రోహిత్ శర్మ(6) క్రీజులో ఉన్నాడు. .. రెండు ఓవర్లకు స్కోర్..15/0
భువనేశ్వర్ కుమార్ వేసిన మొదటి ఓవర్లో6 రన్స్ వచ్చాయి. ఆఖరి బంతికి ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ(5) ఫోర్ కొట్టాడు. ఇషాన్ కిషన్(1) క్రీజులో ఉన్నాడు.
టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ మరక్రం బౌలింగ్ తీసుకున్నాడు. ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. ఇరుజట్లు సబ్స్టిట్యూట్స్ ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి.
హైదరాబాద్ సబ్స్టిట్యూట్స్ : అబ్దుల్ సమద్, వివ్రాంత్ శర్మ, గ్లెన్ ఫిలిఫ్స్, మయాంక్ దగర్, ఉమ్రాన్ మాలిక్.
ముంబై సబ్స్టిట్యూట్స్ : రిలే మెరిడిత్, రమన్‌దీప్ సింగ్, కుమార్ కార్తికేయ, శామ్స్ ములని, విష్ణు వినోద్.
A look at the Playing XIs for #SRHvMI
Live - https://t.co/oWfswiuqls #TATAIPL #SRHvMI #IPL2023 pic.twitter.com/yZcFvVGOYB
— IndianPremierLeague (@IPL) April 18, 2023
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మరక్రం టాస్ గెలిచాడు. మొదట బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో, ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
సొంత అన్నాతమ్ముళ్లు ఐపీఎల్లో ఆడడం చూశాం. కానీ, 16వ సీజన్లో మాత్రం కవల సోదరులు ఆడుతున్నారు. వాళ్లు ఎవరంటే.. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ మ్యాచ్‌లో కవల సోదరులు ఇద్దరూ బరిలోకి దిగుతున్నారు. మార్కో జాన్సెన్(సన్ రైజర్స్ హైదరాబాద్), డుయాన్ జాన్సెన్(ముంబై ఇండియన్స్) మొదటిసారి ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఈ అన్నాతమ్ముల సవాల్లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.