IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో వరుస పరాజయాలు,నిలకడలేమికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఢిల్లీ క్యాపిటల్స్.. సొంత గ్రౌండ్లో పంజా విసిరింది. బ్యాటర్లు చితక్కొట్టడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్(87) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ కొట్టిన అతను ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. అతడికి రిలే రస్సో(35) సహకారం అందించాడు. మ్యాక్స్‌వెల్ ఓవర్లో రస్సో సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.
Karn Sharma ends Phil Salt’s superb innings of 87 (45)
Follow the match ▶️ https://t.co/8WjagffEQP #TATAIPL | #DCvRCB pic.twitter.com/cJUUDiwWev
— IndianPremierLeague (@IPL) May 6, 2023
మ్యాక్స్‌వెల్ ఓవర్లో రిలే రస్సో(35) సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు. దాంతో, ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో 3.2 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అక్షర్ పటేల్(8) నాటౌట్‌గా నిలిచాడు.
ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్(87) ఔటయ్యాడు. కరన్ శర్మ ఓవర్లో బౌల్డయ్యాడు. దాంతో, ఢిల్లీ మూడో వికెట్ పడింది. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్(7) మొదటి బంతినే స్టాండ్స్‌లోకి పంపాడు. రిలే రస్సో(28) ఆడుతున్నాడు. 16 ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 179/3. ఢిల్లీ విజయానికి 24 బంతుల్లో 3 రన్స్ కావాలి.
రిలే రస్సో(20), ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్(74) దూకుడు పెంచారు. హర్షల్ పటేల్ ఓవర్లో రస్సో రెండు, సాల్ట్ ఒక సిక్స్ బాదారు. దాంతో, 24 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 150/2
మిచెల్ మార్ష్(26) ఔటయ్యాడు. హర్షల్ పటేల్ ఓవర్లో లొమ్రోర్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. రిలే రస్సో(4), ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్(64) ఆడుతున్నారు. 11 ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 123/2
Harshal Patel with an immediate impact 💪
Mahipal Lomror with the catch to dismiss Mitch Marsh for 26
Follow the match ▶️ https://t.co/8WjagffEQP #TATAIPL | #DCvRCB pic.twitter.com/APxpvX10eq
— IndianPremierLeague (@IPL) May 6, 2023
దంచి కొడుతున్న ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్(53) హాఫ్ సెంచరీ కొట్టాడు. కరణ్ శర్మ ఓవర్లో బౌండరీతో 50 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇది అతనికి రెండో ఫిఫ్టీ. దాంతో, ఢిల్లీ స్కోర్ 100 దాటింది. మిచెల్ మార్ష్(21) ఆడుతున్నాడు. 8 ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 102/1.
Phil Salt is on song tonight 👊
He reaches his 5️⃣0️⃣ and also bring up the 1️⃣0️⃣0️⃣ for @DelhiCapitals 👏#DC require 80 runs in 66 balls
Follow the match ▶️ https://t.co/8WjagffEQP #TATAIPL | #DCvRCB pic.twitter.com/o0YYWlAnPN
— IndianPremierLeague (@IPL) May 6, 2023
ఢిల్లీ బ్యాటర్లు దంచుతున్నారు. దాంతో, ఆ జట్టు తొలిసారి ఈ సీజన్లో పవర్ ప్లేలో భారీ స్కోర్ చేసింది. వికెట్ నష్టానికి 70 రన్స్ కొట్టింది. ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్(35), మిచెల్ మార్ష్(10) ఆడుతున్నారు.
ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(22) ఔటయ్యాడు. హేజిల్‌వుడ్ వేసిన ఆరో ఓవర్ తొలి బంతికి డూప్లెసిస్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు.
ఢిల్లీ ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్(35) రెచ్చిపోయి ఆడుతున్నాడు. సిరాజ్ ఓవర్లలో వరుసగా రెండు సిక్స్‌లు, ఫోర్ బాదాడు. దాంతో, 19 పరుగులు వచ్చాయి. డేవిడ్ వార్నర్(22) ఆడుతున్నాడు. 5 ఓవర్లకు స్కోర్..60/0.
ఢిల్లీ ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్(17) జోరు పెంచాడు. హేజిల్‌వుడ్ ఓవర్లో ఫోర్, సిక్స్ బాదాడు. దాంతో, 12 పరుగులు వచ్చాయి. డేవిడ్ వార్నర్(10) ఆడుతున్నాడు. 3 ఓవర్లకు స్కోర్.. 29/0.
డేవిడ్ వార్నర్(8) దంచుతున్నాడు. సిరాజ్ ఓవర్లో తొలి బంతికి, మూడో బంతికి బౌండరీ కొట్టాడు. దాంతో, 10 పరుగులు వచ్చాయి. ఫిలిఫ్ సాల్ట్(1) ఆడుతున్నాడు.
ఖలీల్ అహ్మద్ వేసిన 20వ ఓవర్ తొలి బంతికి దినేశ్ కార్తిక్(11) ఔటయ్యాడు. కార్తిక్ కొట్టిన బంతిని బౌండరీ దగ్గర వార్నర్ అందుకున్నాడు. రెండో బంతికి అనుజ్ రావత్(8) సిక్స్ బాదాడు. ఆఖరి బాల్‌కు పరుగు రాకపోవడంతో ఆర్సీబీ వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. మహిపాల్ లోమ్రోర్(54) నాటౌట్‌గా నిలిచాడు.
Maiden #TATAIPL 5️⃣0️⃣ for Mahipal Lomror 👏
An important contribution to steer #RCB to a competitive total 👌
Follow the match ▶️ https://t.co/8WjagffEQP #DCvRCB pic.twitter.com/FJ6xQM0nSZ
— IndianPremierLeague (@IPL) May 6, 2023
మహిపాల్ లోమ్రోర్(52) హాఫ్ సెంచరీ సాధించాడు. ముఖేశ్ కుమార్ ఓవర్లలో బౌండరీ కొట్టి యాభైకి చేరువయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. దాంతో, ఈ సీజన్లో కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్ తర్వాత అర్ధ శతకం బాదిన నాలుగో ప్లేయర్‌గా గుర్తింపు సాధించాడు. దినేశ్ కార్తిక్(11) ఆడుతున్నాడు. 19 ఓవర్లకు స్కోర్ 172/3
దినేశ్ కార్తిక్(10) ఆఖరి బంతికి సిక్స్ కొట్టాడు. దాంతో, 15 పరుగులు వచ్చాయి. మహిపాల్ లోమ్రోర్(48) హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. 18 ఓవర్లకు స్కోర్ 166/3
హాఫ్ సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ(55) ఔటయ్యాడు. ముఖేశ్ కుమార్ బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. మహిపాల్ లోమ్రోర్(34) ఆడుతున్నాడు. 11 ఓవర్లకు స్కోర్.. 137-3.
Yet another 5️⃣0️⃣ for @imVkohli 🙌
The #RCB batter continues his fine form 👌
Follow the match ▶️ https://t.co/8WjagffEQP #TATAIPL | #DCvRCB pic.twitter.com/w3w0nF2xoL
— IndianPremierLeague (@IPL) May 6, 2023
మిచెల్ మార్ష్ వరుస బంతుల్లో ఫాఫ్ డూప్లెసిస్(45), మ్యాక్స్‌వెల్(0)ను ఔట్ చేశాడు. డూప్లెసిస్ గాల్లోకి లేపిన బంతిని బౌండరీ వద్ద అక్షర్ పటేల్ క్యాచ్ పట్టడాడు. దాంతో, 82 రన్స్ వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ కీపర్ సాల్ట్ చేతికి చిక్కాడు. హ్యాట్రిక్ బంతికి మహిపాల్ లోమ్రోర్ సింగిల్ తీశాడు. విరాట్ కోహ్లీ(36) ఆడుతున్నాడు.
విరాట్ కోహ్లీ(35), ఫాఫ్ డూప్లెసిస్(44) దూకుడుగా ఆడుతున్నారు. దాంతో ఆర్సీబీ 10 ఓవర్లకు వికెట్ పడకుండా 79 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ(31) జోరు పెంచాడు. కుల్దీప్ యాదవ్‌కు బౌండరీతో స్వాగతం పలికాడు. ఫాఫ్ డూప్లెసిస్(33) ఆడుతున్నాడు. 8 ఓవర్లకు స్కోర్.. 64/0
ఫాఫ్ డూప్లెసిస్(29) దంచుతున్నాడు. ఖలీల్ అహ్మద్ ఓవర్లో లాంగాఫ్‌లో సిక్స్ బాదాడు. ఆ తర్వాత బంతికి ఫోర్ కొట్టాడు. దాంతో ఆర్సీబీ స్కోర్ 50కి చేరింది. విరాట్ కోహ్లీ(22) ఆడుతున్నాడు. 6 ఓవర్లకు స్కోర్.. 51/0.
End of Powerplay@RCBTweets with a strong start 💪#RCB have reached their 5️⃣0️⃣ after 6 overs👌
Follow the match ▶️ https://t.co/8WjagffEQP #TATAIPL | #DCvRCB pic.twitter.com/NDo0DQBsfK
— IndianPremierLeague (@IPL) May 6, 2023
ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(19) దూకుడుగా ఆడుతున్నాడు. ముఖేశ్ కుమార్ ఓవర్లో మిడాఫ్‌లో బౌండరీ బాదాడు. ఆ తర్వాత నాలుగో, ఐదో బంతుల్ని కూడా బౌండరీకి తరలించాడు. విరాట్ కోహ్లీ(17) ఆడుతున్నాడు. 5 ఓవర్లకు స్కోర్.. 36/0
పరుగుల వీరుడు కోహ్లీ ఐపీఎల్లో రికార్డు సాధించాడు. 7 వేల పరుగుల మైలురాయికి చేరువయ్యాడు. ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి ప్లేయర్ అతనే కావడం విశేషం. శిఖర్ ధావన్ రెండో స్థానంలో ఉన్నాడు.
7⃣0⃣0⃣0⃣ 𝗜𝗣𝗟 𝗥𝗨𝗡𝗦 𝗙𝗢𝗥 𝗞𝗜𝗡𝗚 𝗞𝗢𝗛𝗟𝗜! 👑@imVkohli becomes the first batter to surpass this milestone in IPL 🫡
TAKE. A. BOW 👏#TATAIPL | #DCvRCB | @RCBTweets pic.twitter.com/VP4dMvLTwY
— IndianPremierLeague (@IPL) May 6, 2023
ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లో రెండో బంతికి విరాట్ కోహ్లీ(7) కవర్స్‌లో ఫోర్ కొట్టాడు. 7 పరుగులు వచ్చాయి. ఫాఫ్ డూప్లెసిస్(0) ఆడుతున్నాడు.
ఢిల్లీ సబ్స్టిట్యూట్స్ : చేతన్ సకారియా, లలిత్ యాదవ్, రిపల్ పటేల్, ప్రవీణ్ దూబే, అభిషేక్ పొరెల్.
ఆర్సీబీ సబ్స్టిట్యూట్స్ : హర్షల్ పటేల్, సుయాష్ ప్రభుదేశాయ్, విజయ్‌కుమార్, మైఖేల్ బ్రేస్‌వెల్.
Here are the Playing XIs of the two teams 👌👌
Follow the match ▶️ https://t.co/8WjagffEQP #TATAIPL | #DCvRCB pic.twitter.com/CkMRFXdQph
— IndianPremierLeague (@IPL) May 6, 2023
ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈరోజు ఢిల్లీ స్టేడియంలో తన చిన్నప్పటి కోచ్ రాజ్‌కుమార్ శర్మను కలిశాడు. అతడి పాదాలను తాకి తన విధేయతను చాటుకున్నాడు.
A wholesome meet & greet 🤗@imVkohli catches up with his childhood coach 👌🏻👌🏻#TATAIPL | #DCvRCB | @RCBTweets pic.twitter.com/YHifXeN6PE
— IndianPremierLeague (@IPL) May 6, 2023
ఢిల్లీ జట్టు రెండు మార్పులతో ఆడనుంది. స్వదేశం వెళ్లిన అన్రిజ్ నార్జ్ ప్లేస్‌లో ముఖేశ్ కుమార్ వచ్చాడు. గత మ్యాచ్‌కు దూరమైన మిచెల్ మార్ష్ అందుబాటులో ఉన్నాడు. ఇక ఆర్సీబీ జట్టులోకి కేదార్ జాదవ్ వచ్చాడు. ఈ సీజన్లో అతను తొలి మ్యాచ్ ఆడనున్నాడు.
టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ తీసుకుంది. దాంతో, ఢిల్లీ మొదట బౌలింగ్ చేయనుంది.