Paris Olympics 2024 | రష్యా, బెలారస్ అథ్లెట్లకు షాకిచ్చిన ఒలింపిక్స్ కమిటీ
Paris Olympics 2024 : ఉక్రెయిన్‌పై యుద్దానికి తెగబడిన రష్యా(Russia)పై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) తీరుతో ఆ దేశ అథ్లెట్లకు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికే పలు అంతర్జాతీయ పోటీల్లో నిషేధానికి...
Paris Olympics 2024 : ఉక్రెయిన్‌పై యుద్దానికి తెగబడిన రష్యా(Russia)పై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) తీరుతో ఆ దేశ అథ్లెట్లకు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికే పలు అంతర్జాతీయ పోటీల్లో నిషేధానికి గురైన రష్యా క్రీడాకారులకు తాజాగా అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(IOC) ఊహించని షాక్ ఇచ్చింది.
వచ్చే ఏడాది ప్యారిస్ ఆతిథ్యమిస్తున్న ఒలింపిక్స్ పోటీల్లో రష్యాతో పాటు బెలారస్ అథ్లెట్లు తటస్థ దేశాల జెండా కింద పోటీపడాలని స్పష్టం చేసింది. అంతేకాదు విశ్వక్రీడల్లో పాల్గొనేందుకు ఈ రెండు దేశాల పాస్‌పోర్టు(Pass Port)తో వచ్చే క్రీడాకారులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని వెల్లడించింది.
‘విశ్వ క్రీడల్లో పోటీపడుతున్న ఆటగాళ్ల వ్యక్తిగత హక్కులను గైరవిస్తాం. ఆయా దేశాల ఒలింపిక్ కమిటీలను సస్పెండ్ చేసినప్పటికీ అథ్లెట్ల మానవ హక్కులకు ఎలాంటి భంగం కలిగించం’ అని ఐఓసీ ఓ ప్రకటనలో తెలిపింది.
రష్యా అథ్లెట్లు

ఇప్పటివరకూ రష్యా నుంచి ఎనిమిది మంది, బెలారస్ నుంచి ముగ్గురు మాత్రమే తటస్ఠ అథ్లెట్లుగా అర్హత సాధించారు. మరోవైపు ఉక్రెయిన్ నుంచి ఏకంగా 60 మంది క్వాలిఫై అయ్యారు. ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలకు ఇప్పటివరకూ పలు దేశాలకు చెందిన 4,600 మంది అథ్లెట్లు అర్హత సాధించారు.
ఇవి కూడా చదవండి
- Telangana Assembly | తెలంగాణ శాసనసభ 14వ తేదీకి వాయిదా
- KCR | శస్త్రచికిత్స తర్వాత వాకర్ సాయంతో నడిచిన కేసీఆర్
- Telangana Assembly | ప్రమాణస్వీకారం చేయని 18 మంది ఎమ్మెల్యేలు వీరే..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

