Inter Miami – Messi | మేజర్ లీగ్ సాకర్ చరిత్ర ఇకపై.. మెస్సీకి ముందు.. మెస్సీ తర్వాత : మియామి క్లబ్
MLS : ఫుట్‌బాల్ ఐకాన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) వచ్చే సీజన్లో అమెరికాకు చెందిన ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్‌కు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ స్టార్ ఆటగాడి రాక పట్ల మిమామి యాజమాన్యం ఎంతో సంతోషంగా ఉంది. ఆ క్లబ్ యజమాని జార్జె మస్(Jorge Mas) మేజర్ లీగ్ సాకర్(Major League Soccer)లో మెస్సీ ఆడడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఇకనుంచి అందరూ మా క్లబ్ గురించి...
MLS : ఫుట్‌బాల్ ఐకాన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) వచ్చే సీజన్లో అమెరికాకు చెందిన ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్‌కు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ స్టార్ ఆటగాడి రాక పట్ల మిమామి యాజమాన్యం ఎంతో సంతోషంగా ఉంది. ఆ క్లబ్ యజమాని జార్జె మస్(Jorge Mas) మేజర్ లీగ్ సాకర్(Major League Soccer)లో మెస్సీ ఆడడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఇకనుంచి అందరూ మా క్లబ్ గురించి మాట్లాడాల్సి వస్తే.. మెస్సీకి ముందు.. మెస్సీ తర్వాత అని చెప్పుకుంటారని అనుకుంటున్నా.
అంతేకాదు మేజర్ సాకర్ లీగ్ చరిత్రలో.. అతను మా క్లబ్‌కు గొప్ప అంబాసిడర్ అవుతాడు. మా క్లబ్‌కు ఆడిన అత్యుత్తమ ప్లేయర్‌గా నిలుస్తాడు’ అని మస్ తెలిపాడు. అంతేకాదు మెస్సీ రాకతో మేజర్ లీగ్ సాకర్ రాత మారుతుందని, ప్రపంచంలోని రెండు లీగ్స్‌లో చోటు సంపాదిస్తుందని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ క్లబ్ సహ- యజమానిగా ఇంగ్లండ్ మాజీ ఆటగాడు డేవిడ్ బెక్‌హమ్(David Beckham) కొనసాగుతున్నాడు.
ఆ రెండు క్లబ్స్ కాదనుకొని
వరల్డ్ కప్ హీరో మెస్సీ.. జూన్ 30వ తేదీన పీఎస్జీ క్లబ్ తరఫున మెస్సీ ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. రెండేళ్ల కాంట్రాక్ట్ ముగియడంతో అతను పీఎస్జీకి గుడ్ బై చెప్పాడు. దాంతో, వచ్చే సీజన్లో అతను ఏ క్లబ్‌కు ఆడతాడు? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా(Barcelona), సౌదీ అరేబియా క్లబ్ అల్ – హిలాల్(Al Hilal ) క్లబ్స్ ఈ దిగ్గజ ఆటగాడితో ఒప్పందం కోసం ప్రయత్నించాయి. కానీ, మెస్సీ మాత్రం మియామి క్లబ్‌కు ఓకే చెప్పాడు.
ఖతర్‌లో నిరుడు వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడుతున్న మెస్సీ

అర్జెంటీనాకు మెస్సీ నిరుడు వరల్డ్ కప్(FIFA World Cup) అందించాడు. రెండోసారి అర్జెంటీనాను ఫైనల్‌కు చేర్చిన అతను తన వరల్డ్ కప్ కలను నిజం చేసుకున్నాడు. ఫ్రాన్స్‌తో జరిగిన టైటిల్ పోరులో మెస్సీ రెండు గోల్స్ కొట్టాడు. ఎంబాపే హ్యాట్రిక్ గోల్స్‌తో హడలెత్తించినా చివరకు షూటౌట్లో 4-2తో అర్జెంటీనా గెలుపొందింది.
ఇవి కూడా చదవండి
Venus Williams | రఫ్పాడించిన వీనస్ విలియమ్స్.. నాలుగేళ్ల తర్వాత టాప్ -50 క్రీడాకారిణిపై విజయం
Netherlands Cricket Team | వన్డేల్లో రెండోసారి రికార్డు స్కోర్ కొట్టిన నెదర్లాండ్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

