Netherlands Cricket Team | వన్డేల్లో రెండోసారి రికార్డు స్కోర్ కొట్టిన నెదర్లాండ్స్
Netherlands Cricket Team : నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు వన్డేల్లో రెండోసారి అత్యధిక స్కోర్ నమోదు చేసింది. వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫైయర్(ODI World Cup Qualifier 2023) మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో మంగళవారం జింబాబ్వేపై 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ మొదటిసారి 2007లో....
Netherlands Cricket Team : నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు వన్డేల్లో రెండోసారి అత్యధిక స్కోర్ నమోదు చేసింది. వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫైయర్(ODI World Cup Qualifier 2023) మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో మంగళవారం జింబాబ్వేపై 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్(88), కెప్టెన్ ఎడ్వర్డ్స్(83),మాక్స్ ఒడోవ్డ్(59) అర్ధ సెంచరీలతో చెలరేగారు. దాంతో నెదర్లాండ్స్ వన్డేల్లో రెండోసారి రికార్డు స్కోర్ కొట్టింది.
నెదర్లాండ్స్ జట్టు మొదటిసారి 2007లో బెర్ముడా(Bermuda)పై 8 వికెట్ల నష్టానికి 315 స్కోర్ చేసింది. ఆ మ్యాచ్‌లో 172 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ గెలుపొందింది. మొత్తంగా.. ఇప్పటివరకు నెదర్లాండ్స్ వన్డేల్లో ఐదోసారి 300లకు పైగా పరుగులు సాధించింది.
పోటీలో మాజీ చాంపియన్లు
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్(ODI World Cup) భారత్‌లో జరగనుంది. ఈ మెగా టోర్నీకి ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించాయి. మిగిలిన రెండు స్థానాల కోసం మొత్తం పది జట్లు పోటీపడుతున్నాయి. వీటిలో మాజీ చాంపియన్లు వెస్టిండీస్, శ్రీలంక కూడా ఉన్నాయి. వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ మ్యాచుల్లో ఈ రెండు జట్లు పసికూనలతో తలపడుతున్నాయి. జింబాబ్వే వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌కు అర్హత సాధిస్తాయి. భారతదేశంలో అక్టోబర్ 5న వన్డే వరల్డ్ కప్ మొదలవ్వనుంది. 2011లో ఎంఎస్ ధోనీ(MS Dhoni) కెప్టెన్సీలో వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా మరోసారి కప్పుపై కన్నేసింది. ఒకవేళ భారత చాంపియన్‌గా నిలిస్తే మూడోసారి వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా రికార్డుల్లోకి ఎక్కుతుంది.
ఇవి కూడా చదవండి
Satwiksairaj – Chirag Shetty | సాత్విక్ – చిరాగ్ జోడీకి కెరీర్ అత్యుత్తమ ర్యాంక్.. టాప్ -20లో శ్రీకాంత్
Kylian Mbappe | ఎంబాపే మరో రికార్డు.. ఎక్కువ గోల్స్ కొట్టిన ఫ్రాన్స్ ఆటగాడిగా గుర్తింపు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

