Kylian Mbappe | ఎంబాపే మరో రికార్డు.. ఎక్కువ గోల్స్ కొట్టిన ఫ్రాన్స్ ఆటగాడిగా గుర్తింపు
Kylian Mbappe : ఫుట్‌బాల్ స్టార్ కైలియన్ ఎంబాపే(Kylian Mbappe) సరికొత్త రికార్డు సాధించాడు. ఒకే సీజన్లో ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు, ఈసారి పీఎస్జీ(PSG) క్లబ్ తరఫున కూడా టాప్ గోల్ స్కోరర్ అతనే. దాంతో, 65 ఏళ్ల రికార్డు బద్ధలు కొట్టాడు. ఈ సీజన్లో ఎంబాపే ఏకంగా...
Kylian Mbappe : ఫుట్‌బాల్ స్టార్ కైలియన్ ఎంబాపే(Kylian Mbappe) సరికొత్త రికార్డు సాధించాడు. ఒకే సీజన్లో ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు, ఈసారి పీఎస్జీ(PSG) క్లబ్ తరఫున కూడా టాప్ గోల్ స్కోరర్ అతనే. దాంతో, 65 ఏళ్ల రికార్డు బద్ధలు కొట్టాడు. ఈ సీజన్లో ఎంబాపే ఏకంగా 54 గోల్స్ కొట్టాడు. యూరో 2024 క్వాలిఫైయర్స్(Euro 2024 qualifiers ) మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు.
గ్రీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ యంగ్‌స్టర్ 55వ నిమిషంలో పెనాల్టీని గోల్ పోస్ట్‌లోకి పంపి 54వ గోల్ ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు దివంగత స్ట్రైకర్ జస్ట్ ఫొంటేన్(Just Fontaine) పేరు మీద ఉంది. అతను 1957-58లో ఒకే సీజన్లో 53 గోల్స్ చేసి రికార్డు నెలకొల్పాడు.
వరల్డ్ కప్ ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్
ఖతర్‌లో నిరుడు జరిగిన వరల్డ్ కప్(FIFA World Cup) ఫైనల్లో ఎంబాపే సంచలన ప్రదర్శన చేశాడు. హ్యాట్రిక్ గోల్స్ కొట్టి ఫ్రాన్స్‌ను గెలిపించినంత పనిచేశాడు. అయితే.. షూటౌట్లో 4-2తో గెలిచిన అర్జెంటీనా వరల్డ్ కప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. టోర్నీలో అత్యధికంగా 8 గోల్స్ కొట్టిన ఎంబాపేకు గోల్డెన్ బూట్(Golden Boot) అవార్డు దక్కింది.
మెస్సీ, నెయ్మర్ జూనిరయ ర్తో ఎంబాపే

వరల్డ్ కప్ తర్వాత లియోనల్ మెస్సీ(Lionel Messi), నెయ్మర్ జూనిరయర్, ఎంబాపే.. వీళ్లంతా పీఎస్జీ తరఫున సౌదీ అరేబియా లీగ్‌లో ఆడారు. ఈ మధ్యే మెస్సీ పీఎస్జీని వీడడంతో ఈ ఫ్రాన్స్ ఆటగాడు కూడా కొత్త క్లబ్‌కు వెళ్తాడనే వార్తలు వినిపించాయి. తాను క్లబ్ తీరు పట్ల సంతృప్తిగా ఉన్నానని, వచ్చే సీజన్లో క్లబ్ నుంచి పెద్దగా ఏం ఆశించడం లేదని ఎంబాపే తెలిపాడు. దాంతో, క్లబ్ మారడంపై ప్రచారంలో ఉన్న వదంతులకు చెక్ పెట్టాడు.
ఇవి కూడా చదవండి
Ashes Series | ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా రికార్డు ఛేదన ఎంతంటే..?
Hardik Pandya | వదినకు రూ.లక్ష కాదు.. రూ. 5 లక్షలు ఇస్తా.. పాండ్యా పెళ్లి వీడియో వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

