Venus Williams | రఫ్పాడించిన వీనస్ విలియమ్స్.. నాలుగేళ్ల తర్వాత టాప్ -50 క్రీడాకారిణిపై విజయం
Venus Williams : ఒకప్పటి వరల్డ్ నంబర్ 1 వీనస్ విలియమ్స్(Venus Williams) సంచలన విజయం సాధించింది. ఈమధ్యే గాయం నుంచి కోలుకున్న ఆమె 48వ ర్యాంకర్ కమిలా గ్లోర్లి(Camila Giorgi)పై గెలుపొందింది. బర్మింగ్హమ్ క్లాసిక్(Birmingham Classic)లో ఆమె...
Venus Williams : ఒకప్పటి వరల్డ్ నంబర్ 1 వీనస్ విలియమ్స్(Venus Williams) సంచలన విజయం సాధించింది. ఈమధ్యే గాయం నుంచి కోలుకున్న ఆమె 48వ ర్యాంకర్ కమిలా గ్లోర్లి(Camila Giorgi)పై గెలుపొందింది. బర్మింగ్హమ్ క్లాసిక్(Birmingham Classic)లో ఆమె 7-6 (5), 4-6, 7-6 (6)తో కమిలాను చిత్తు చేసింది. 3 గంటల 17 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఈ అమెరికా నల్ల కలువ పట్టువిడవకుండా పోరాడింది. ఈ విజయానికో ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే..? టాప్ – 50లో ఉన్న క్రీడాకారిణిపై వీనస్ గెలుపొందడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి.
‘నేను గత కొన్ని రోజులుగా చాలా మ్యాచ్‌లు మిస్ అయ్యాను. అందుకని ఈ విజయం నాకు చాలా గొప్పగా అనిపిస్తోంది’ అని మ్యాచ్ అనంతరం వీనస్ సంతోషం వ్యక్తం చేసింది. ఏడు గ్రాండ్ స్లామ్(Grand Slam) టైటిళ్లు, ఐదు వింబుల్డన్(Wimbledon) ట్రోఫీలు నెగ్గిన వీనస్ ప్రస్తుతం 697 ర్యాంక్‌లో ఉంది.
చెల్లెలు సెరెనాతో వీనస్ విలియమ్స్

చెల్లెలితో కలసి..
ఒకప్పుడు మహిళల టెన్నిస్ అంటే.. వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్(Serena Williams) మాత్రమే గుర్తుకొచ్చేవాళ్లు. ఈ అక్కాచెల్లెళ్లు అంతంగా తమ ఆధిపత్యం చెలాయించారు. టోర్నీ ఏదైనా టైటిల్ విజేతగా నిలిచేది మాత్రం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరే. చెల్లెలు సెరెనాతో కలిసి వీనస్ డబుల్స్‌లో టైటిళ్లు కొల్లగొట్టింది. అయితే.. కొత్త తరం క్రీడాకారిణులు వచ్చాక పోటీ ఎక్కువైంది. దానికి తోడూ గాయాలు వెంటాడడంతో ఆటలో వెనకబడింది. ఈ ఏడాది ఆరంభంలో ఆక్లాండ్ ఓపెన్(Aucland Open)లో హార్మ్‌స్ట్రింగ్(Harmstring)కు గాయం కావడంతో ఆమె ఆరు నెలలు టెన్నిస్‌కు దూరమైంది. గాయం నుంచి కోలుకున్నాక రాకెట్ పట్టిన వీనస్‌కు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. లిబెమా ఓపెన్‌లో 17 ఏళ్ల సెలినే నాఫ్(Selene Naef) ఆమెను చిత్తు చేసింది.
ఇవి కూడా చదవండి
Netherlands Cricket Team | వన్డేల్లో రెండోసారి రికార్డు స్కోర్ కొట్టిన నెదర్లాండ్స్
Satwiksairaj – Chirag Shetty | సాత్విక్ – చిరాగ్ జోడీకి కెరీర్ అత్యుత్తమ ర్యాంక్.. టాప్ -20లో శ్రీకాంత్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

