న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముం దు భారత్‌ను గాయాల బెడ ద బాధిస్తూనే ఉన్నది. ఇప్పటికే జడే జా, బుమ్రా మెగాటోర్నీకి దూరం కాగా తాజాగా యువ పేసర్ దీపక్ చాహర్ ఇందులో చేరాడు. వెన్నెముక గాయం నుంచి చాహర్ పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముందని బీసీసీఐ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీ20 టోర్నీకి మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, శార్దుల్ ఠాకూర్‌ను ఆస్ట్రేలియాకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే మెగాటోర్నీలో మార్పులు, చేర్పులతో తుది జట్టు ప్రకటించడానికి ఈనెల 15వ తేదీ ఆఖరు కావడంతో బోర్డు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. ఇదిలా ఉంటే.. అయ్యర్, రవి బిష్ణోయ్ ప్రస్తుతం స్టాండ్‌బై జాబితాలో ఉన్నారు.