INDWvsENGW Test: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు విజయం దిశగా సాగుతోంది. ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న టెస్టులో రెండో రోజు ఆటలో అటు బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించిన భారత్.. భారీ ఆధిక్యాన్ని సాధించి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్.. 42 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న డీవై పాటిల్ పిచ్‌పై ఇప్పటికే 478 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్.. మూడో రోజే ఘన విజయం సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే ఆలౌట్ అయింది.
ఓవర్ నైట్ స్కోరు 410-7తో రెండో రోజు ఆరంభించిన భారత్.. మరో 18 పరుగులు జోడించి 428 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్‌ను స్పిన్‌తో బంధించింది. దీప్తి శర్మ (7/5) ఐదు ఓవర్లే వేసి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ వెన్ను విరిచింది. స్నేహ్ రాణా కూడా రెండు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది.
తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్న భారత్.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే దూకుడును ప్రదర్శించింది. ఓపెనర్ షఫాలీ వర్మ (33), స్మృతి మంధాన (26)లు భారీ స్కోర్లు చేయలేకపోయినా తొలి వికెట్‌కు 61 పరుగులు చేసి శుభారంభం అందించారు. మూడు ఓవర్ల వ్యవధిలో ఈ ఇద్దరూ ఔటయ్యారు. వన్ డౌన్లో వచ్చిన యస్తికా భాటియా (9) కూడా విఫలమైంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అర్థ సెంచరీతో ఆకట్టుకున్న జెమీమా రోడ్రిగ్స్ (27) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కానీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (44 బ్యాటింగ్), దీప్తి శర్మ (20), పూజా వస్త్రకార్ (17 బ్యాటింగ్) సాయంతో భారత ఆధిక్యాన్ని 450 పరుగులు దాటించింది.
An exciting day of Test cricket in Mumbai comes to an end 🔥#INDvENG | 📝: https://t.co/Qye5bbdCGR pic.twitter.com/q3toHjWCdX
— ICC (@ICC) December 15, 2023
కష్టమే..
మరో మూడు రోజుల ఆటతో పాటు పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే అద్భుతమే జరగాలి. అదీగాక మహిళల క్రికెట్లో ఇప్పటివరకూ ఓ జట్టు ఛేదించిన టార్గెట్ 198 పరుగులు మాత్రమే. 1998లో శ్రీలంక.. పాకిస్తాన్ ఎదుట నిర్దేశించిన 410 పరుగుల లక్ష్యమే ఇప్పటివరకూ అత్యధికం. తాజాగా భారత్ ఇప్పటికే 478 పరుగుల లీడ్‌లో ఉంది. ఈ కొండను కరిగించాలంటే.. అదీ స్పిన్ పిచ్‌పై అంటే ఇంగ్లండ్ బ్యాటర్లకు శక్తికి మించిన పనే…!