Mukesh Kumar Marriage: జట్టును వదిలి అమ్మాయితో ‘జట్టు కట్టిన’ టీమిండియా పేసర్..
Mukesh Kumar Marriage: మూడో టీ20లో టీమిండియా యువ పేసర్ ముకేష్ కుమార్ ఆడటం లేదు. ముకేష్‌కు రిప్లేస్గా దీపక్ చాహర్‌ను ఎంపిక చేయడంతో అతడికి ఏమైనా గాయమైందా..? అన్న భయాందోళనలు అభిమానులను వెంటాడాయి. కానీ ముకేశ్..
Mukesh Kumar Marriage: భారత్-ఆస్ట్రేలియా మధ్య గువహతిలోని బర్సపర స్టేడియంలో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా యువ పేసర్ ముకేష్ కుమార్ ఆడటం లేదు. అతడి స్థానంలో మరో పేసర్ అవేశ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ముకేష్‌కు రిప్లేస్గా దీపక్ చాహర్‌ను ఎంపిక చేయడంతో అతడికి ఏమైనా గాయమైందా..? అన్న భయాందోళనలు అభిమానులను వెంటాడాయి. కానీ ముకేశ్.. ఆస్ట్రేలియాతో మ్యాచ్ కంటే తన జీవితంలో ముఖ్యమైన మ్యాచ్ ఆడేందుకు నేటి పోటీ నుంచి తప్పుకున్నాడు. నేడు అతడు వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. పెళ్లి కారణంగా అతడు మూడో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్‌తో పాటు బీసీసీఐ కూడా ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించింది.
టాస్ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ‘మా తుది జట్టులో ఒక మార్పు జరిగింది. ముకేష్ స్థానంలో అవేశ్ ఆడుతున్నాడు. ముకేశ్ ఈ రోజు తన జీవితంలోనే అత్యంత పెద్ద మ్యాచ్ (పెళ్లి) ఆడుతున్నాడు. నేడు అతడి పెళ్లి. మేం అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని అన్నాడు.
Mukesh Kumar misses the 3rd T20I due to his marriage.#INDvAUS pic.twitter.com/C0llLXiEkb
— CricAsh (@ash_cric) November 28, 2023
బీసీసీఐ కూడా ఎక్స్ ద్వారా స్పందిస్తూ.. ‘మూడో టీ20కి ముందే ఫాస్ట్ బౌలర్ ముకేశ్ తనకు లీవ్ కావాలని మమ్మల్ని అడిగాడు. ఈరోజు అతడి పెళ్లి సందర్భంగా అతడు సెలవు తీసుకున్నాడు. రాయ్‌పూర్‌లో జరుగబోయే నాలుగో మ్యాచ్‌కు ముందే అతడు జట్టుతో కలవనున్నాడు. మిగిలిన సిరీస్‌లో దీపక్ చాహర్ భారత జట్టుతో కలిశాడు..’ అని ట్వీట్ చేసింది.
Update: Fast bowler Mukesh Kumar made a request to BCCI to be released from India’s squad ahead of the third T20I against Australia in Guwahati. Mukesh is getting married and has been granted leave for the duration of his wedding festivities.
He will join the squad ahead of the…
— BCCI (@BCCI) November 28, 2023
ముప్పై ఏండ్ల ముకేశ్.. పుట్టి పెరిగింది బీహార్‌లో అయినా దేశవాళీలో ఆడేది మాత్రం బెంగాల్ జట్టుకు.. ఈ ఏడాది జులైలో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లగా అక్కడ జాతీయ జట్టుకు ఎంట్రీ ఇచ్చాడు. అదే టూర్లో వన్డేలు, టీ20లలో కూడా అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఒక టెస్టు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడాడు. విండీస్ సిరీస్‌తో పాటు ఆసీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో కూడా మెరుగైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

