Muscles | వృద్ధాప్యంలో కండరాలు బలంగా ఎలా ఉంటాయి.. ఏయే అంశాలు దోహదం చేస్తాయి..?
వయసు పెరిగే కొద్దీ కండరాల బలం తగ్గడం సహజం. అయితే, వృద్ధాప్యంలో కండరాల్లో చోటుచేసుకునే కొన్ని మార్పులు వాటిని దెబ్బతినకుండా కాపాడేందుకు ఉపయోగపడతాయని కోపెన్హాగన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో గుర్తించారు. కండరాల్లో వేగంగా పనిచేసే ఫైబర్లు, నెమ్మదిగా పనిచేసే ఫైబర్లు ఉంటాయి. వేగంగా పనిచేసే ఫైబర్లు తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని అందిస్తాయి.
Muscles | వయసు పెరిగే కొద్దీ కండరాల బలం తగ్గడం సహజం. అయితే, వృద్ధాప్యంలో కండరాల్లో చోటుచేసుకునే కొన్ని మార్పులు వాటిని దెబ్బతినకుండా కాపాడేందుకు ఉపయోగపడతాయని కోపెన్హాగన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో గుర్తించారు. కండరాల్లో వేగంగా పనిచేసే ఫైబర్లు, నెమ్మదిగా పనిచేసే ఫైబర్లు ఉంటాయి. వేగంగా పనిచేసే ఫైబర్లు తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని అందిస్తాయి. అయితే త్వరగా అలసిపోతాయి. నెమ్మదిగా పనిచేసే ఫైబర్లు ఎక్కువసేపు శ్రమించేందుకు సహాయపడతాయి. వీటిలో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియా ఎక్కువగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ మైటోకాండ్రియా పనితీరు తగ్గుతుంది. అయినప్పటికీ కండరాల్లో నెమ్మదిగా పనిచేసే ఫైబర్ల సంఖ్య పెరుగుతుంది. ఈ మార్పు ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు పరిశోధకులు అధ్యయనం చేశారు.
ప్రత్యేక కొవ్వు అణువుపై దృష్టి..
ఈ పరిశోధనలో మైటోకాండ్రియాలో ఉండే కార్డియోలిపిన్ అనే ప్రత్యేక కొవ్వు అణువుపై దృష్టి సారించారు. మైటోకాండ్రియా నిర్మాణం, పనితీరు సక్రమంగా ఉండడానికి ఇది కీలకం. వయసు పెరగడం లేదా కొన్ని వ్యాధుల కారణంగా ఎలుకలు, మనుషుల కండరాల్లో కార్డియోలిపిన్ స్థాయిలు తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీని ప్రభావంతో మైటోకాండ్రియా నిర్మాణంలో మార్పులు వచ్చి, శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గుతుంది. ఈ మార్పులకు కార్డియోలిపిన్ లోపమే కారణమా అని తెలుసుకునేందుకు యువ ఎలుకల్లో దాని స్థాయిని తగ్గించారు. ఫలితంగా వాటి కండరాల్లోనూ వేగంగా పనిచేసే ఫైబర్లు తగ్గి, నెమ్మదిగా పనిచేసే ఫైబర్లు పెరిగాయి. అయితే కార్డియోలిపిన్ను సాధారణ స్థాయిలో మూడింట రెండొంతుల వరకు తిరిగి పెంచినప్పుడు కండరాల క్షీణత తగ్గడంతోపాటు, ఎలుకల్లో ముందస్తు మరణాలు పూర్తిగా నివారించబడ్డాయి.
కీలకపాత్ర పోషించే ప్రోటీన్..
కార్డియోలిపిన్ తగ్గినప్పుడు దెబ్బతిన్న మైటోకాండ్రియా నుంచి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ (ఆర్ఓఎస్) అనే క్రియాశీల అణువులు అధికంగా విడుదలవుతాయి. ఇవి కణాలకు హాని కలిగిస్తాయి. అయితే కండరాల ఫైబర్లలో మార్పు రావడానికి సంకేతాలుగా కూడా పనిచేస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రక్రియలో ఈఆర్ఆర్గామా అనే ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మైటోకాండ్రియా పనితీరుకు అనుగుణంగా కండరాల ఫైబర్లలో మార్పులను సమన్వయం చేస్తుంది. అలాగే కార్డియోలిపిన్ తక్కువగా ఉన్న ఎలుకల కండరాలు రక్తం నుంచి ఎక్కువ గ్లూకోజ్‌ను గ్రహించాయి. ఆ చక్కెరను శక్తి కోసం కాకుండా, తమను తాము రక్షించుకునే యాంటీఆక్సిడెంట్ల తయారీకి వినియోగించుకున్నాయి. అంటే కండరాలు బలాన్ని కొంత కోల్పోయినా, కణాలను దెబ్బతినకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయని పరిశోధకులు వివరించారు.
కండరాల క్షీణతను తగ్గించవచ్చా..
ఈ ఫలితాలు వయసుతో వచ్చే కండరాల క్షీణతకు భవిష్యత్తులో కొత్త చికిత్సా మార్గాలను చూపిస్తున్నాయి. అయితే కండరాల రక్షణ విధానం, దాని ద్వారా క్షీణతను తగ్గించడం వంటి ప్రయోగాలు ప్రస్తుతం ఎలుకలపైనే జరిగాయి. మనుషుల్లోనూ వయసుతో కార్డియోలిపిన్ స్థాయిలు తగ్గుతున్నట్లు మాత్రమే నమూనాల ద్వారా నిర్ధారించారు. కార్డియోలిపిన్ను స్థిరంగా ఉంచేందుకు రూపొందించిన ఎలామిప్రెటైడ్ అనే ఔషధానికి బార్త్ సిండ్రోమ్ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి చికిత్స కోసం అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ వేగవంతమైన అనుమతి ఇచ్చింది. అలాగే కండరాల మార్పులను నియంత్రించే ఈఆర్ఆర్గామా ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకుని చికిత్సలు అభివృద్ధి చేసే అవకాశాలనూ పరిశోధకులు పరిశీలిస్తున్నారు. కార్డియోలిపిన్ స్థాయిలను పెంచడం లేదా ఈ ప్రోటీన్ పనితీరును ప్రభావితం చేయడం ద్వారా వృద్ధాప్యంలో కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చా అన్నది భవిష్యత్తు పరిశోధనల్లో తేలాల్సి ఉంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Muscles | వృద్ధాప్యంలో కండరాలు బలంగా ఎలా ఉంటాయి.. ఏయే అంశాలు దోహదం చేస్తాయి..?
Renu Desai | నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?.. మాజీ భార్య ట్యాగ్‌పై నటి రేణు దేశాయ్ ఆవేదన
Supreme Court: ఢిల్లీ వెదర్ ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా.. చమత్కరించిన సుప్రీంకోర్టు
హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే : జగన్ మోహన్ రావు
Dada | బాలయ్య ‘దాదా’లో క్రేజీ ఐటెం సాంగ్.. థమన్ ఈసారి కూడా మాస్ బీట్తో దుమ్మురేపనున్నాడా?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

