కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఎదుట అన్నదాతలు అడుగడుగునా కన్నీళ్లు పెట్టుకోవడం ప్రతి ఒక్కరిని కదిలించింది.
మెదక్ : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఎదుట అన్నదాతలు అడుగడుగునా కన్నీళ్లు పెట్టుకోవడం ప్రతి ఒక్కరిని కదిలించింది. కాంగ్రెస్ పాలనలో కరెంటు రాక, సాగునీరు అందక చేతికొచ్చిన వరి పంటలు కళ్లముందే ఎండిపోయాయని హరీశ్ రావు ఎదుట రైతులు వాపోయారు. సకాలంలో కరెంటు అందక తన 7 ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయిందని కుమార్ అనే రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల నాణ్యమైన కరెంటుతో రెండు పంటలు పండించుకున్నాం.. ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొందన్నారు.
వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నా.. కనీసం ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మరికొంత మంది అన్నదాతలు మండిపడ్డారు. రైతుబంధు పూర్తిగా ఎగ్గొట్టారని కేవలం ఒక్క ఎకరానికే వేసి రేవంత్ సర్కార్ చేతులు దులుపుకుందని హరీశ్ రావుకు మొరపెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన రైతు రుణమాఫీ అంతా బోగస్.. గ్రామంలో పది మందిలో కనీసం ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయాం.. మళ్లీ 100 శాతం కేసీఆర్ సార్ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడే తమ కష్టాలు తీరుతాయని హరీశ్ రావు ఎదుట ధీమా వ్యక్తం చేశారు. ఈ సంర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మార్పు అంటే కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటును, రైతుబంధును బంద్ పెట్టి పచ్చని పొలాలను ఎండబెట్టడమేనా.. రేవంత్ ప్రభుత్వంపై హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఎండిన ప్రతి ఎకరానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే వరకు పెండింగ్ రైతుబంధు, పూర్తిస్థాయి రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ సర్కార్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రైతన్నలు అధైర్యపడకండి. ఈ రెండేళ్లు సీఎం రేవంత్ రెడ్డి మెడలు వంచి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- farmers
- harish rao
- Narsapur
- Tears
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
Muscles | వృద్ధాప్యంలో కండరాలు బలంగా ఎలా ఉంటాయి.. ఏయే అంశాలు దోహదం చేస్తాయి..?
Renu Desai | నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?.. మాజీ భార్య ట్యాగ్‌పై నటి రేణు దేశాయ్ ఆవేదన
Supreme Court: ఢిల్లీ వెదర్ ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా.. చమత్కరించిన సుప్రీంకోర్టు
హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే : జగన్ మోహన్ రావు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

