అంబర్‌పేట, డిసెంబర్ 29 : గోల్నాక డివిజన్ జైస్వాల్గార్డెన్కు చెందిన 60 ఏండ్ల చెలగోల ఇంద్రసేన యాదవ్ ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటి మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు.
ఇటీవలే జరిగిన పదో తెలంగాణ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్-2025 పోటీల్లో.. బటర్ ఫ్లై 50 మీటర్స్, 100 మీటర్ల బ్యాక్స్టోక్స్, 200 మీటర్స్ ఐఎం అంశాలలో ఇంద్రసేన యాదవ్ స్వర్ణం గెలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఇంద్రసేన యాదవ్‌ను అభినందించారు.