Sree Charani : ఏడాది క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన శ్రీ చరణి( Sree Charani) నంబర్ 1 ర్యాంక్ పట్టేసింది. నిలకడగా రాణిస్తున్న ఈ తెలుగమ్మాయి అంతర్జాతీయ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న పొట్టి వరల్డ్‌కప్‌లో తిప్పేస్తున్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ టాప్ ర్యాంక్‌కు ఎగబాకింది.
ఐసీసీ మంగళవారం ప్రకటించిన మహిళల టీ20 బౌలర్ల జాబితాలో భారత స్పిన్నర్ శ్రీ చరణి అగ్రస్థానం సాధించింది. నిరుడు జూన్ 28న ఇంగ్లండ్‌తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టిన చరణి.. తన స్పిన్ మ్యాజిక్‌తో టీమిండియా విజయాల్లో కీలకవుతూనే.. వ్యక్తిగతంగా తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకుంది. గతేడాది స్వదేశంలో 14 వికెట్లతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకమైన తెలుగమ్మాయి.. పదో సీజన్ టీ20 వరల్డ్‌కప్‌లోనూ చెలరేగిపోతోంది.
Shree Charani made her T20I debut in June last year, and 12 months later she sits at the top of the ICC T20I bowling rankings. 👏🔥
A remarkable rise for the young Indian spinner, whose consistency and match-winning performances have taken her all the way to No. 1 in the world.… pic.twitter.com/x7qPSrYbMZ
— Sportskeeda (@Sportskeeda) June 23, 2026
లీగ్ దశలో మూడు మ్యాచుల్లోనే ఈ మిస్టరీ స్పిన్నర్ 10 వికెట్లతో సత్తా చాటింది. ఫలితంగా ర్యాంకింగ్స్‌లో చరణి టాప్‌లో నిలవగా.. ఇంగ్లండ్‌కు చెందిన చార్లీ డీన్, లిన్సే స్మిత్ వరసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకోగా.. మాజీ వరల్డ్ నంబర్ 1 సోఫియా ఎకిల్‌స్టోన్ నాలుగుతో సరిపెట్టుకుంది. ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న పొట్టి వరల్డ్‌కప్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసినప్పటికీ భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు టాప్-5లో చోటు దక్కలేదు.
A blinder of a return catch followed by a peach to hit the timber! 🔥
Sree Charani turns the game around with 2️⃣ wickets in 3️⃣ balls 🫡
Updates ▶️ https://t.co/cIrb7Ekn0x#TeamIndia | #T20WorldCup | #WomenInBlue | #SAvIND pic.twitter.com/Z3PCG1z0r6
— BCCI Women (@BCCIWomen) June 21, 2026
1. శ్రీ చరణి(భారత్) – 753 పాయింట్లు
2. చార్లీ డీన్(ఇంగ్లండ్) – 733 పాయింట్లు
3. లిన్సే స్మిత్(ఇంగ్లండ్) – 726 పాయింట్లు
4. సోఫియా ఎకిల్‌స్టోన్(ఇంగ్లండ్) – 722 పాయింట్లు
5. సాదియా ఇక్బాల్ (పాకిస్థాన్) – 714 పాయింట్లు
6. నొన్కులులెకొ మ్లాబా(దక్షిణాఫ్రికా) – 713 పాయింట్లు
7. లారెన్ బెల్(ఇంగ్లండ్) – 710 పాయింట్లు
8. దీప్తి శర్మ (భారత్) – 708 పాయింట్లు