క్వీన్స్లాండ్: క్రికెట్ స్ఫూర్తి, క్రీడాస్ఫూర్తి గురించి ఈ మధ్య చర్చలు తరచూ వింటూనే ఉన్నాం. అయితే ఆస్ట్రేలియా వుమెన్స్ క్రికెట్ టీమ్‌తో జరుగుతున్న ఏకైక డేనైట్ టెస్ట్‌లో ఇండియన్ బ్యాటర్ పూనమ్ రౌత్ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తిపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. రెండో రోజు ఆటలో అంపైర్ నాటౌట్ అని ప్రకటించినా.. ఆమె తనకు తానుగా వెళ్లిపోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా షేర్ చేస్తూ.. నమ్మశక్యం కాని దృశ్యం అంటూ కామెంట్ చేసింది.
ఓవైపు పింక్ బాల్ టెస్ట్‌లో సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన స్మృతి మందానాపై ప్రశంసల జల్లు కురుస్తుండగానే.. పూనమ్ రౌత్ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి కూడా ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఎంతగా అప్పీల్ చేసినా.. అంపైర్ అవుట్ ఇవ్వలేదు. అయితే ఆలోపే పూనమ్ పెవిలియన్ వైపు వెళ్లిపోయింది. బాల్ తన బ్యాట్‌కు తగిలే వికెట్ కీపర్ చేతుల్లో పడటంతో అంపైర్ నిర్ణయంతో సంబంధం లేకుండా ఆమె క్రీజు వదిలి వెళ్లింది.
Unbelievable scenes 😨
— cricket.com.au (@cricketcomau) October 1, 2021
Punam Raut is given not out, but the Indian No.3 walks! #AUSvIND | @CommBank pic.twitter.com/xfAMsfC9s1