అమ్మన్(జోర్డాన్): అండర్-17 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్ రోనక్ దహియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన 110కిలోల గ్రీకోరోమన్ విభాగం క్వార్టర్స్‌లో రోనక్ 8-1తో ఆర్థర్ మాన్వలిన్పై అద్భుత విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన దూకుడు కొనసాగించిన రోనక్ తన తదుపరి పోరులో హంగరీకి చెందిన జొల్టన్ జాకోతో తలపడుతాడు. మరోవైపు 80కిలోల కేటగిరీలో నిశాంత్ ఫోగాట్ 7-1తో మహమ్మద్ అబాదీ(అల్జీరియా)పై గెలిచి ముందంజ వేశాడు.
ముంబై: భారత స్టార్ క్యూయిస్టు పంకజ్ అద్వానీ డబుల్ ధమాకాతో అదరగొట్టాడు. వెస్టర్న్ ఇండియా బిలియర్డ్స్, స్నూకర్ చాంపియన్‌షిప్‌లో సీనియర్ టైటిల్ విజయంతో ఆకట్టుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్లో పంకజ్ 6-4తో కమల్చావ్లా(ఈస్ట్ రైల్వేస్)ను ఓడించాడు. తొలుత జరిగిన బిలియర్డ్స్ ఫైనల్లో అద్వానీ..జోల్టన్ జకో(హంగరీ)పై గెలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు.