న్యూఢిల్లీ: భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్.. ఏటీపీ చాలెంజర్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. ఆస్ట్రియా వేదికగా ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాగల్ 2-6, 4-6తో విట్ కొప్రివో (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడాడు. సెమీఫైనల్లో టాప్ సీడ్‌ను మట్టికరిపించిన నాగల్.. తుదిపోరులో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. వరుస సెట్లలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.