చాంగ్వాన్: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత యువ షూటర్ అర్జున్ బబుతా పసిడి పతకంతో మెరిశాడు. సోమవారం జరిగిన పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో అర్జున్ 17-9 తేడాతో లుకాస్ కొజినెస్కీ (అమెరికా) పై అద్భుత విజయం సాధించాడు. పూర్తి ఏకపక్షంగా సాగిన తుది పోరులో అర్జున్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. పంజాబ్‌కు చెందిన ఈ 23 ఏండ్ల యువ షూటర్‌కు సీనియర్ కేటగిరీలో ఇది తొలి పతకం. ఇజ్రాయెల్ షూటర్ సెర్గె రిక్టర్కు కాంస్య పతకం దక్కింది.