Sumit Nagal | ఇండియన్ వెల్స్: ప్రతిస్ఠాత్మక ఇండియన్ వెల్స్ టోర్నీలో భారత యువ యువ ప్లేయర్ సుమిత్ నాగల్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రా తొలి రౌండ్లో నాగల్ 3-6, 3-6తో మిలోస్ రవోనిక్(కెనడా) చేతిలో ఓటమిపాలయ్యాడు. గంటా 28 నిమిషాల పాటు జరిగిన పోరులో నాగల్ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేకపోయాడు. రవోనిక్ తన 12 బ్రేక్ పాయింట్లలో మూడు పాయింట్లను కాపాడుకుంటే నాగల్ రెండింటిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు.