Chetan Sakariya | వైభవంగా ఐపీఎల్ హీరో పెండ్లి.. ఫొటోలు చూశారా..!
Chetan Sakariya : భారత యువ క్రికెటర్ చేతన్ సకారియా (Chetan Sakariya) పెండ్లి చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో వెలుగులోకి వచ్చిన సకారియా మంగళవారం మేఘనా జంబుచా (Meghna Jambhucha)ను పరిణయమాడాడు.
Chetan Sakariya : భారత యువ క్రికెటర్ చేతన్ సకారియా (Chetan Sakariya) పెండ్లి చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో వెలుగులోకి వచ్చిన సకారియా మంగళవారం మేఘనా జంబుచా (Meghna Jambhucha)ను పరిణయమాడాడు. తమ జీవితంలో అద్భుతమైన క్షణాలకు సంబంధించిన ఫొటోలను ఈ యంగ్ స్పీడ్‌స్టర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
‘ఈ రోజుతో నేను నీవయ్యాను. నువ్వు నేనయ్యాను’ అంటూ రెండు వాఖ్యాల్లో తమ బంధాన్ని వర్ణించాడు. వివాహ వేడుక సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో సకారియా, మేఘన మెరిసిపోతున్న ఫొటోలు చూసినవాళ్లంతా కొత్త జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత క్రికెటర్లు, ఐపీఎల్ సహచరులు సకారియాకు కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలానికి ముందే సకారియా, మేఘనల ఎంగేజ్మెంట్ జరిగింది. తాజాగా కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఇద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
తొలి సీజన్లో 14 వికెట్లతో..
దేశవాళీలో సౌరాష్ట్రకు ఆడిన సకారియా పేస్ సంచలనంగా పేరొందాడు. 2021లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ యంగ్‌స్టర్ తొలి సీజన్లో రాజస్థాన్ తరఫున 14 వికెట్లతో మెరిశాడు. ఐపీఎల్ ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చిన యువ క్రికెటర్లలో సకారియా ఒకడు. టీమిండియా జెర్సీతో ఒకే ఒక వన్డే, రెండు టీ20లు ఆడాడంతే. లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకూ ఈ స్పీడ్‌స్టర్ 20 వికెట్లు పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి
- Amit Shah – Union Budget 2025 | ఉపాధి కల్పనకు నూతన అధ్యాయం.. యువత, మహిళల సాధికారతకు పెద్దపీట.. అమిత్‌షా
- Harish Rao | తెలంగాణ పదమే ఉచ్ఛరించలేదు.. కేంద్ర బడ్జెట్‌పై హరీశ్‌రావు ధ్వజం
- Supreme Court | ‘అసాధారణ పరిస్థితుల్లోనే బెయిల్ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలి’ : సుప్రీంకోర్టు
- Rana Naidu 2 | రానా నాయుడు -2 లో అదే కంటెంట్ వుంటుందా?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

