Amit Shah – Union Budget 2025 | ఉపాధి కల్పనకు నూతన అధ్యాయం.. యువత, మహిళల సాధికారతకు పెద్దపీట.. అమిత్‌షా
Amit Shah - Union Budget 2025 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఉపాధి, అవకాశాల కల్పనకు కొత్త అధ్యాయం కల్పించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
Amit Shah – Union Budget 2025 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఉపాధి, అవకాశాల కల్పనకు కొత్త అధ్యాయం కల్పించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సంపన్న దేశంగా అవతరించేందుకు మార్గం సుగమం చేసిందని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారిశ్రామిక కేంద్రంగా భారత్ ఆర్థిక వృద్ధి రేటును ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్రమోదీ అచంచలమైన నిబద్ధతకు ప్రతిబింబంగా కేంద్ర బడ్జెట్ ఉందని మంగళవారం ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా పోస్ట్ పెట్టారు. ఆదాయం పన్ను అంచనా నిబంధనలను సరళతరం చేయడం ద్వారా వేతన జీవులకు ఉపశమనం కల్పించిందని తెలిపారు.
బడ్జెట్ ఫర్ వికసిత్ భారత్ అనే హ్యాచ్ ట్యాగ్ (#BudgetForViksitBharat) పై ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టిన అమిత్ షా.. భారతీయుల విశ్వాసం, ఆశలు, ఆకాంక్షలకు కేంద్ర బడ్జెట్ ప్రతిబింబంలా నిలిచిందని వ్యాఖ్యానించారు. రైతులకు పలు అవకాశాలు కల్పించడంతోపాటు మహిళలు, యువతకు సాధికారత కల్పించే దిశగా అడుగులేసిందన్నారు. తద్వారా సంపన్న దేశంగా, స్వయం సమృద్ధి భారత్ నిర్మాణానికి బడ్జెట్ కీలక ముందడుగు వేసిందని పేర్కొన్నారు. ‘ప్రజానుకూల, అభివృద్ధి అనుకూల మార్గదర్శన బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

