Supreme Court | ‘అసాధారణ పరిస్థితుల్లోనే బెయిల్ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలి’ : సుప్రీంకోర్టు
Supreme Court | అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే కోర్టులు బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించాలని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను తోసిపుచ్చుతూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
Supreme Court | అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే కోర్టులు బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించాలని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను తోసిపుచ్చుతూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. బెయిల్‌పై స్టే విధించే హక్కు కోర్టుకు ఉన్నప్పటికీ, ఇది అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే చేయాలంటూ స్పష్టం చేసింది.
కోర్టులు యాంత్రికంగా, ఎలాంటి కారణం చూపకుండా బెయిల్ ఉత్తర్వులపై స్టే ఇవ్వకుండా ఉండాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ కేసులో పర్వీందర్ సింగ్ ఖురానా పిటిషన్‌పై కోర్టు ఇలా స్పందించింది. సబార్డినేట్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక (సవరణ) చట్టం కింద నమోదైన కేసులో ఖురానాకు సబార్డినేట్ కోర్టు గత ఏడాది జూన్ 17న బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Murder | నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణ హత్య..!
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
భోజనం చేద్దామన్నఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. ధాన్యం కొంటే చాలు..! నేనే 10 మందికి పెడతానని రైతు సమాధానం : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

