చెన్నై: ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ పోటీపడనున్నాడు. సెప్టెంబర్‌లో బుడాపెస్ట్ (హంగేరీ)లో జరిగే ఈ టోర్నీలో పోటీపడే భారత పురుషు ల, మహిళల జట్లను ఆల్ఇండియా చెస్ ఫెడరేషన్(ఏఐసీఎఫ్) శనివారం ప్రకటించింది. పురుషుల విభాగంలో అర్జున్‌తో పాటు హరికృష్ణ, గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్ సంతోష ఉన్నారు.
సీడెడ్ రెజ్లర్లుగా అంతిమ్, అమన్
పారిస్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లు అంతిమ్ పంగల్(53కి), అమన్ షెరావత్(57కి)సీడింగ్ దక్కింది. తమ తమ విభాగాల్లో వరుసగా అంతిమ్ నాలుగో సీడ్, అమన్ ఆరో సీడ్‌గా బరిలోకి దిగనున్నారు. దీంతో తొలి బౌట్లలో కఠిన ప్రత్యర్థులు ఎదురయ్యే పరిస్థితి నుంచి అంతిమ్, అమన్ బయటపడ్డారు. విశ్వక్రీడల్లో రెజ్లింగ్ పోటీలు ఆగస్టు 5 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్నాయి.