రొవెరెటో: భారత టెన్నిస్ ద్వయం ఎన్ శ్రీరామ్ బాలాజీ-రిత్విక్ చౌదరి ఇటలీలో జరిగిన ఏటీపీ చాలెంజర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. పురుషుల డబుల్స్ ఫైనల్స్‌లో భారత జోడీ.. 6-3, 2-6, 12-10తో ఫ్రాన్సిస్కో కాబ్రల్ (పోర్చుగ్రీస్)-థియో అర్రిబగె (ఫ్రెంచ్)ను ఓడించారు. తొలి సెట్‌ను అలవోకగా నెగ్గిన భారత ద్వయం.. రెండో సెట్లో వెనుకంజ వేసినా నిర్ణయాత్మక మూడో సెట్లో పుంజుకుని టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.