FIFA Rankings | న్యూఢిల్లీ: ఇటీవల రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్ (సాఫ్)టైటిల్ గెలుచుకున్న భారత జట్టు.. ఫిఫా ర్యాంకింగ్స్లో టాప్-100లో చోటు దక్కించుకుంది. గురువారం ఫిఫా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో సునీల్ ఛెత్రీ సారథ్యంలోని భారత ఫుట్బాల్ జట్టు 99వ ప్లేస్లో నిలిచింది. 2018 తర్వాత భారత్కు ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం.
ఓవరాల్గా భారత్ 1996లో అత్యుత్తమంగా సాకర్ ర్యాకింగ్స్లో 94వ ప్లేస్ సాధించింది. ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా టాప్లో కొనసాగుతుండగా.. ఫ్రాన్స్, బ్రెజిల్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. ఆసియా ర్యాంకింగ్స్లో జపాన్ (ప్రపంచ 20వ ర్యాంక్) టాప్లో ఉంది.