World Championships 2023 | సింధు, ప్రణయ్, లక్ష్యసేన్‌కు కష్టమైన డ్రా
BWF World Championships 2023 : బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్(Indian Shuttlers) షట్లర్లకు కష్టమైన డ్రా ఎదురైంది. ఒలింపిక్ విజేత పీవీ సింధు(PV Sindhu)కు క్వార్టర్స్‌లో బలమైన ప్రత్యర్థి ఎదురుకానుంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy), లక్ష్య సేన్(Lakshya Sen)లది కూడా అదే పరిస్థితి. ఇక డబుల్స్‌లో సాత్విక్....
World Championships 2023 : బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్(Indian Shuttlers) షట్లర్లకు కష్టమైన డ్రా ఎదురైంది. ఒలింపిక్ విజేత పీవీ సింధు(PV Sindhu)కు క్వార్టర్స్‌లో బలమైన ప్రత్యర్థి ఎదురుకానుంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy), లక్ష్య సేన్(Lakshya Sen)లది కూడా అదే పరిస్థితి. ఇక డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్(Satwiksairaj) – చిరాగ్ శెట్టి(Chirag Shetty)కి తొలి రౌండ్ బై లభించింది. ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగుతున్న ప్రణయ్ తొలి మ్యాచ్‌లో ఫిన్లాండ్కు చెందిన కల్లె కల్జోనెన్తో తలపడనున్నాడు.
మారిషస్ ఆటగాడు గార్జెస్ జులియన్ పాల్‌తో లక్ష్య సేన్, జపాన్ ప్లేయర్ కెంటా నిషిమొటోతో కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) తాడోపేడో తేల్చుకోనున్నారు. డెన్మార్క్ కోపెన్‌హగన్‌లో ఆగస్టు 21 నుంచి 27 వరకు బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ పోటీలు జరుగనున్నాయి.
పీవీ సింధు

ఈ ఏడాది ఒక్క టోర్నమెంట్లోనూ క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయిన సింధుకు తొలి రౌండ్లో బై లభించింది. అయితే.. టైటిల్ వేటలో ఆమెకు గట్టి పోటీ ఎదురవ్వనుంది. అవును.. నొజొమి ఒఖుహర(Nozomi Okuhara), తుయ్ లిన్హ్ గుయెన్(Thuy Linh Nguyen) మ్యాచ్ విజేతతో రెండో రౌండ్లో సింధు తలపడనుంది. ఒకవేళ భారత షట్లర్ ఈ మ్యాచ్ గెలిస్తే.. తర్వాతి రౌండ్లో ఏడో సీడ్ రాట్చనొక్ ఇంటనాన్(Ratchanok Intanon)తో పోటీ పడుతుంది. క్వార్టర్స్‌లో సింధు వరల్డ్ నంబర్ 1 అన్ సే యంగ్‌ను ఢీ కొట్టాల్సి రావొచ్చు.
మిక్స్డ్ డబుల్స్‌లో..
మహిళల డబుల్స్‌లో త్రీసా జాలీ, గాయత్రి గోపిచంద్‌కు కూడా మొదటి రౌండ్ బై లభించింది. అశ్విని భక్త్, శిఖా గౌతమ్ జోడీ నెదర్లాండ్స్‌కు చెందిన డెబొరా జిల్లె, చెరిల్ సీనెన్ జంటను ఢీ కొట్టనుంది.
రోహన్ కపూర్, సిక్కి రెడ్డి

మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్, ఎన్ సిక్కి రెడ్డి ద్వయం స్కాట్లాండ్ జోడీ ఆడం హల్, జులీ మ్యాక్ఫెర్సన్తో పోటీ పడనుంది. మరో భారత ద్వయం వెంకట్ ప్రసాద్, జుహీ దేవగన్ జర్మనీకి చెందిన జోన్స్ రల్ఫీ జాన్సెన్, లిండా ఎఫ్లెర్తో తలపడనుంది.
ఇవి కూడా చదవండి
The Hundred League 2023 | ది హండ్రెడ్ లీగ్‌లో సంచలనం.. 20 బంతుల్లో ఏకంగా 19 డాట్ బాల్స్
ODI WC 2023 | ప్రపంచ కప్ జట్టులో తిలక్ వర్మ ఉండాలి.. ఎందుకంటే..? : మాజీ సెలెక్టర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

