టోక్యో: భారత రైఫిల్ షూటర్ మహిత్ సంధు టోక్యోలో జరుగుతున్న 25వ డెఫ్లింపిక్స్లో మూడో పతకంతో సత్తాచాటింది. గురువారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్ ఫైనల్లో మహిత్.. 246.1 పాయింట్లు సాధించి రెండో స్థానంతో రజతం సొంతం చేసుకుంది.
ఎలిస్కా స్వొబొడొవ (చెక్-247.2) పసిడి గెలిచింది. ఈ టోర్నీలో ఆమెకు ఇది మూడో పతకం కావడం విశేషం. అంతకుముందు పది మీటర్ల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజతం నెగ్గగా పది మీటర్ల వ్యక్తిగత ఈవెంట్లోనూ రజతంతో మెరిసింది. భారత గోల్ఫర్ దీక్ష దగర్ స్వర్ణం సాధించింది. 2021 ఎడిషన్‌లోనూ ఆమె బంగారు పతకం గెలిచింది.