Tokyo Paralympics | భవీనాకు సిల్వర్.. పారాలింపిక్స్ టీటీ ఫైనల్లో ఓటమి
భవీనా | టోక్యో పారాలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ రజత పతకం సాధించింది. చైనా ప్లేయర్, వరల్డ్ నంబర్ వన్ సీడ్ యింగ్ జావోతో జరిగిన ఫైనల్

టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్‌లో రజత పతకం సాధించింది. చైనా ప్లేయర్, వరల్డ్ నంబర్ వన్ సీడ్ యింగ్ జావోతో జరిగిన ఫైనల్ పోరులో 3-0తో ఓటమిపాలయింది. 34 ఏండ్ల భవీనాపై 7-11, 5-11, 6-11 స్కోర్‌తో జయకేతనం ఎగురవేసిన జావో.. బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో భవీనా సిల్వర్ మెడల్‌తో దేశానికి రానుంది. అయితే పారాలింపిక్స్ చరిత్రలో టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కి పతకం దక్కడం ఇదే మొదటిసారి.
గుజరాత్‌కి చెందిన భవీనాబెన్ పటేల్ పోలియో కారణంగా చక్రాల కుర్చీకి పరిమితమైంది. మొదట్లో ఫిట్నెస్ కోసం సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడటం ప్రారంభించిన భవీనా.. ఆ తర్వాత దానినే కెరీర్‌గా ఎంచుకుని కష్టపడింది. మొదట్లో వెనుకబడినా మధ్యలో పుంజుకోవడాన్ని బాగా అలవాటు చేసుకున్నది. మొత్తంగా పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత రెండో అథ్లెట్‌గా అరుదైన ఘనత సాధించింది. 2016లో దీపా మాలిక్ రజత పతకం గెలుపొందిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

