వాంటా (ఫిన్లాండ్): ఆర్క్టిక్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మిక్స్డ్ డబుల్స్ ఆటగాళ్లు ధృవ్ కపిల, తనీషా క్రాస్టో ద్వయం క్వార్టర్స్ చేరింది. ప్రిక్వార్టర్స్‌లో భారత జంట.. 23-25, 21-14, 21-17తో టిటోవ్, కాంటెమిర్ (ఉక్రెయిన్) జోడీని ఓడించి క్వార్టర్స్ చేరింది.
మహిళల సింగిల్స్‌లో తన్య హేమంత్ రౌండ్ ఆఫ్-16లో 9-21, 8-21తో రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది.