భారత హాకీ జట్లకు నిరాశ
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు నిరాశ ఎదురైంది. లండన్ వేదికగా ఆదివారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లలో భారత్‌కు ఓటమి తప్పలేదు.
లండన్: ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు నిరాశ ఎదురైంది. లండన్ వేదికగా ఆదివారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లలో భారత్‌కు ఓటమి తప్పలేదు. తొలి మ్యాచ్‌లో జర్మనీని చిత్తుచేసిన పురుషుల జట్టు ఆదివారం 1-3తో బ్రిటన్ చేతిలో అపజయం పాలైంది.
భారత్ తరఫున అభిషేక్ ఒక్కడే గోల్ చేయగా బ్రిటన్ నుంచి నికోలస్ రెండు, కల్నన్ విల్ ఓ గోల్ చేశారు. ఇక మహిళల విభాగంలోనూ భారత్.. 2-3తో పరాభవాన్ని మూటగట్టుకుంది. కౌర్ నవ్‌నీత్, దేవి షర్మిల భారత్‌కు రెండు గోల్స్ అందించగా బ్రిటన్ నుంచి చార్లెట్ వాట్సన్ రెండు, పీటర్ ఇసాబెల్లె ఓ గోల్ చేసి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

