పారిస్: భారత లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్ పారిస్ డైమండ్ లీగ్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. తద్వారా ఈ లీగ్‌లో పతకం సాధించిన మూడో భారతీయ అథ్లెట్‌గా శ్రీశంకర్ రికార్డుల్లోకెక్కాడు. గతంలో నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో), వికాస్ గౌడ (డిస్కస్ త్రో) మాత్రమే ఇక్కడ మెడల్స్ నెగ్గారు.
శనివారం జరిగిన పోటీల్లో శ్రీశంకర్ 8.09 మీటర్లు లంఘించి మూడో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గిన శ్రీశంకర్.. మూడో ప్రయత్నంలో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఒలింపిక్ చాంపియన్ మిల్టియాడిస్ (8.13 మీ.), సైమన్ ఎమ్మెర్ (8.11 మీ.) వరుసగా స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు.