జింజు (కొరియా): ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్ జెరెమి లాల్రినుంగా 67 కిలోల విభాగంలో స్నాచ్‌లో రజత పతకం చేజిక్కించుకున్నాడు. నాన్ ఒలింపిక్ విభాగమైన ఈ పోటీలో లాల్రినుంగా క్లీన్ అండ్ జర్క్‌లో విఫలమయ్యాడు.
స్నాచ్‌లో రెండో ప్రయత్నంలో 141 కిలోలు ఎత్తిన జెరెమి రెండో స్థానంలో నిలిచాడు. అయితే క్లీన్ అండ్ జర్క్‌లో తొలి ప్రయత్నంలో 165 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు.