పుణె: ఫిడే వుమెన్స్ గ్రాండ్ ప్రిక్స్‌లో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపితో పాటు చైనాఅమ్మాయి ఝు జినర్ సంయుక్తంగా ఆధిక్యాన్ని సాధించారు. 8 రౌండ్లు పూర్తైన ఈ టోర్నీలో హంపి, జినర్ తలా 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు.
మంగళవారం ముగిసిన 8వ రౌండ్ గేమ్‌ను హంపి డ్రా చేసుకోగా.. దివ్య దేశ్‌ముఖ్‌ను ఓడించిన జినర్ కీలక పాయింట్‌ను దక్కించుకుంది.