virat Kohli | వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న పోరులో టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ (virat Kohli)ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో ఇంగ్లండ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. వరల్డ్‌కప్ చరిత్రలో కోహ్లీ డకౌట్ కావడం ఇదే తొలిసారి కాగా.. ఇంగ్లండ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు చెందిన ‘బర్మీ ఆర్మీ’ సామాజిక మాధ్యమాల్లో కోహ్లీ ఫొటోనూ వైరల్ చేసింది. బాతుకు కోహ్లీ చిత్రాన్ని జోడించి డకౌట్ అని స్ఫురించేలా పోస్ట్ చేసింది.
పోరాట యోధుడిగి గుర్తింపు పొందిన కోహ్లీ.. సాధారణంగా ఖాతా తెరవకుండా వెనుదిరగడం అరుదు కాగా.. ఈ మ్యాచ్‌లో విరాట్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీనిపై బర్మీ ఆర్మీ స్పందిస్తూ.. ‘ఏదో మార్నింగ్ వాక్కు వచ్చినట్లు ఇలా వచ్చి అలా వెళ్లాడు’ అనే క్యాప్షన్‌తో ఓ మీమ్‌ను పోస్ట్ చేసింది. దీంతో చిర్రెత్తిపోయిన భారత అభిమానులు ఇంగ్లండ్ ప్లేయర్ల వంతు వస్తుంది కాచుకోండి అని కామెంట్స్ చేశారు.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత పేస్ ధాటికి ఇంగ్లండ్ ప్లేయర్లు పెవిలియన్‌కు వరుస కట్టడంతో ఇప్పుడు బదులు తీర్చుకుంటున్నారు. సున్నాలు చుట్టిన స్టోక్స్ (Ben Stokes), రూట్( Joe Root)స్వల్ప లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కకపోగా.. మాజీ కెప్టెన్ జో రూట్‌తో పాటు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. దీంతో కోహ్లీ మార్నింగ్ వాక్కు వస్తే.. రూట్, స్టోక్స్ ఈవినింగ్ వాక్‌లో ఔటయ్యారంటూ భారత అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.
ఇక రూట్ ఔటైన సమయంలో కోహ్లీ సంబురాల్లో ముగినిపోయిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బుమ్రా వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి రూట్ వికెట్ల ముందు దొరికిపోయి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగగా.. బెన్ స్టోక్స్‌ను షమీ బలి తీసుకున్నాడు.