Cricketers Love Story | టీమిండియా క్రికెటర్ల లవ్ స్టోరీ.. ప్రపోజ్ చేశారిలా..!
Cricketers Love Story : వాలెంటైన్స్ డే.. ప్రేమ పక్షులకు ఎంతో ముఖ్యమైన రోజు. అందుకే ఫిబ్రవరి నెల రెండో వారంలో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఫిబ్రవరి 8 ని ప్రపోజ్ డే (Propose Day)గా పిలుస్తారు. మరి టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా...
Cricketers Love Story : వాలెంటైన్స్ డే.. ప్రేమ పక్షులకు ఎంతో ముఖ్యమైన రోజు. అందుకే ఫిబ్రవరి నెల రెండో వారంలో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఫిబ్రవరి 8 ని ప్రపోజ్ డే (Propose Day)గా పిలుస్తారు. ఈ రోజున చాలామంది తమ ప్రేయసికి తమ స్టయిల్లో ప్రపోజ్ చేస్తారు. అందుకు సినిమా హీరోలు, క్రికెటర్లు, సెలబ్రిటీలు ఏమీ అతీతం కాదు. మరి టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, యజ్వేంద్ర చాహల్.. గర్ల్ ఫ్రెండ్స్‌కి ఎలా తమ ప్రేమను తెలియజేశారో తెలుసా..?
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli), అనుష్కా శర్మ(Anushka Sharma)లు ఒక షాంపూ యాడ్‌లో కలిశారు. అయితే.. కోహ్లీ మరీ ప్రత్యేకంగా అనుష్కకు ప్రపోజ్ చేయలేదట. ఇద్దరి మనసులు కలవడంతో పెండ్లికి సిద్దమయ్యారు.
కోహ్లీ, అనుష్క

విరుష్కగా పాపులర్ అయిన ఈ ఇద్దరూ 2017 డిసెంబర్ 11న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇటలీలోని ఒక ప్యాలెస్‌లో దాంపత్య జీవితంలో అడుగు పెట్టారు. ఈ జంటకు వామికా(Vamika) అనే కూతురు ఉంది.
స్పోర్ట్స్ క్లబ్లో..
మైదానంలో సిక్సర్లతో విరుచుకపడే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ది ప్రేమవివాహం. రితికా సజ్దేవ్(Ritika Sajdev)ను అతడు మనువాడాడు. రోహిత్, రితికాలు.. స్నేహితుల ద్వారా పరిచయమయ్యారు. తొలి రోజు నుంచే ఈ డాషింగ్ ఓపెనర్ ఆమెపై మనసుపారేసుకున్నాడు.
రోహిత్, రితికా

అయితే.. తన మనసులోని మాటను రితికాకు ఓ స్పోర్ట్స్ క్లబ్లో చెప్పాడు. 11 ఏండ్ల వయసులో క్రికెటర్‌గా తన జర్నీ మొదలైన బొరివల్లీ స్పోర్ట్స్ క్లబ్లో హిట్‌మ్యాన్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. మోకాళ్లపై నిల్చొని ఉంగరం ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పాడు. రోహిత్ ప్రపోజ్ చేసిన తీరుకు ఫిదా అయిన రితికా పచ్చజెండా ఊపేసింది. ఈ జంట 2015లోపెండ్లితో ఒక్కటైంది. వీళ్లకు సమైరా అనే పాప ఉంది.
బీచ్‌లో ప్రేమ మాట
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hadhik Pandya) భార్య నటాషా స్టాంకోవిక్(Natasha Stankovic)కు బీచ్ సమీపంలో ప్రపోజ్ చేశాడు. సెర్బియాకు చెందిన నటి, మోడల్ అయిన నటాషాలో ప్రేమలో పడిన పాండ్యా… 2020 జనవరిలో తన ప్రేమను తెలియచేశాడు. అది కూడా ఒక చిన్న పడవలో ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు.
నటాషా, హార్దిక్ పాండ్యా

ఆ ఏడాది మే నెలలో ఇద్దరూ పెండ్లి చేసుకున్నారు. అయితే.. అప్పుడు కరోనా టైమ్ కావడంతో సన్నిహితుల సమక్షంలోనే మనువాడిన పాండ్యా, నటాషా జంట.. నిరుడు వైభవంగా రెండోసారి పెండ్లి చేసుకుంది. ఈ వేడుకలో వాళ్ల కుమారుడు అగస్త్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
స్టేడియంలో ప్రపోజ్
భారత పేసర్ దీపక్ చాహర్(Deepak Chahar)కు కూడా ఓ ప్రేమ కహానీ ఉంది. ఐపీఎల్ సందర్భంగా అతడు తన ప్రేయసి జయ భరద్వాజ్(Jaya Bharadwaj)కి ప్రపోజ్ చేశాడు. 2021 అక్టోబర్‌లో చాహర్ స్టేడియంలో ఉన్న భరద్వాజ్ దగ్గరకి వెళ్లి.. మోకాళ్లపై నిలబడి ఉంగురం చూపించి తన ప్రేమను వ్యక్తం చేశాడు.
దీపక్ చాహర్, జయ

దాంతో, ఆమె ఒక్కక్షణం ఆశ్చర్యపోగా.. అక్కడ ఉన్నవాళ్లంతా చప్పట్లతో ఇద్దరినీ అభినందించారు. చాహర్, భరద్వాజ్‌లు 2022 జూన్‌లో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. చెన్నై సూపర్ కింగ్స్(CSK) ప్రధాన బౌలర్ అయిన చాహర్ భారత జట్టు తరఫున అద్భుతంగా రాణించాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన చాహర్ కమ్ బ్యాక్ కోసం చూస్తున్నాడు.
డాన్స్ కలిపింది ఇద్దరినీ
బంతితో బ్యాటర్లను ఇరుకున పెట్టే లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్(Yazvendra Chahal) ఓ లవర్ బాయ్. మేటి బ్యాటర్లను సైతం వణికించే చాహల్ డాన్సర్, డెంటిస్ట్ అయిన ధనశ్రీ వర్మ(Dhanshree Varma)తో ప్రేమలో పడ్డాడు. ఆన్లైన్ క్లాస్‌ల పేరుతో ఆమెతో పరిచయం పెంచుకున్న చాహల్ కొన్ని రోజులకే ధనశ్రీకి ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా ఓకే చెప్పడంతో ఇద్దరూ 2020 డిసెంబర్ 22న పెండ్లి చేసుకున్నారు.
చాహల్, ధనశ్రీ

ఆసియా కప్(Asia cup 2023)పై ఎన్నో ఆశలు పెట్టుకున్న లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal)కు నిరాశే మిగిలింది. ఐపీఎల్లో, విండీస్ సిరీస్‌లో అదరగొట్టినా 17 మంది బృందంలో చోటు దక్కించుకోలేకపోయాడు. దాంతో, ఈ స్టార్ స్పిన్నర్‌కు వరల్డ్ కప్(ODI World Cup 2023)లో ఆడాలన్న తన కల చెదరనుందా?
ఇవి కూడా చదవండి
- Virat Kohli – Puma | కోహ్లీనే మా బ్రాండ్ అంబాసిడర్.. తేల్చి చెప్పిన పుమా డైరెక్టర్
- Telangana Assembly | ఈ నెల 13వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు
- Vyuham Movie | ‘వ్యూహం’ సినిమాకు గ్రీన్ సిగ్నల్.. విడుదల ఎప్పుడంటే ?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

