Indian Cricket Team : మూడు వరల్డ్ కప్‌లు.. రెండు విదేశీ టూర్లు.. ఒక ఐపీఎల్.. ఈ ఏడాది భారత క్రికెట్ షెడ్యూల్ ఇదే..
Indian Cricket Team : ఈ ఏడాది పురుషుల, మహిళల క్రికెట్‌తో పాటు అండర్ -19 వరల్డ్ కప్‌లు, ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ ఇతరత్రా మ్యాచ్‌ల షెడ్యూల్ వివరాలు మీకోసం..
Indian Cricket Team : గతేడాది స్వదేశంలో ముగిసిన వన్డే వరల్డ్ కప్‌తో ఐసీసీ ట్రోఫీ ఆశలు రేపిన భారత క్రికెట్ జట్టు.. ఫైనల్ పోరులో ఆసీస్ చేతిలో ఓడిన తర్వాత ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. సఫారీ టూర్లో భాగంగా జనవరి మూడు నుంచి కేప్‌టౌన్ వేదికగా జరుగబోయే టెస్టు ద్వారా మెన్ ఇన్ బ్లూ.. ఈ ఏడాదికి ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నది. పురుషుల జట్టుతో పాటు ఇటీవలే స్వదేశంలో రెండు వరుస టెస్టు సిరీస్‌లు నెగ్గి జోరుమీదున్న మహిళల జట్టు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ (జనవరి 2)తో న్యూఈయర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పనుంది. ఈ ఏడాది పురుషుల, మహిళల క్రికెట్‌తో పాటు అండర్ -19 వరల్డ్ కప్‌లు, ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ ఇతరత్రా మ్యాచ్‌ల షెడ్యూల్ వివరాలు మీకోసం..
మూడు వరల్డ్ కప్‌లు..
2024లో భారత్ మూడు ఐసీసీ ట్రోఫీలలో ఆడనుంది. పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 4-30 వరకు వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరుగబోయే మెగాటోర్నీలో భారత్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సెప్టెంబర్ – అక్టోబర్లలో బంగ్లాదేశ్ వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. అంతేగాక అండర్ – 19 (పురుషుల) వరల్డ్ కప్ కూడా ఈ ఏడాది జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 దాకా జరగనుంది.
పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్..
– జనవరి 3-7 : రెండో టెస్టు (కేప్‌టౌన్, దక్షిణాఫ్రికా)
– జనవరి 11 నుంచి 17 వరకు అఫ్గానిస్తాన్‌తో మూడు టీ20లు (స్వదేశంలో)
– జనవరి 25 నుంచి 29 వరకు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ (స్వదేశంలో)
– జూన్ 4 నుంచి 30 దాకా టీ20 వరల్డ్ కప్ (వెస్టిండీస్-అమెరికా)
– జులై లో శ్రీలంక పర్యటన.. రెండు టెస్టులు, మూడు టీ20లు
– సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, మూడు టీ20లు (స్వదేశంలో)
– అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు (స్వదేశంలో)
– నవంబర్ నుంచి జనవరి 2025 దాకా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టెస్టులు
– మార్చి 22 (అధికారికంగా ప్రకటించాల్సి ఉంది) నుంచి మే చివరి వారం వరకూ ఐపీఎల్
మహిళల జట్టు షెడ్యూల్..
– జనవరి 2న ఆస్ట్రేలియాతో మూడో వన్డే
– జనవరి 5 నుంచి 9 దాకా ఆసీస్‌తో మూడు టీ20లు
–ఫిబ్రవరి – మార్చిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్
– మహిళల క్రికెట్ జట్టుకు సంబంధించిన ఇతర టూర్ల వివరాలు బీసీసీఐ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

