Chess Championship | సింగపూర్: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో డ్రా ల పర్వం కొనసాగుతోంది. గుకేశ్, లిరెన్ మధ్య జరుగుతున్న ఈ మెగా టోర్నీ ఆరో రౌండ్‌ను ఇరువురు ఆటగాళ్లు డ్రాగా ముగించారు. తొలి మ్యాచ్‌లో లిరెన్ నెగ్గగా మూడో మ్యాచ్‌లో గుకేశ్ గెలిచాడు. 2, 4, 5వ మ్యాచ్‌లు డ్రా కాగా తాజాగా వరుసగా మూడో మ్యాచ్ లోనూ అదే ఫలితం పునరావృతమైంది. 46 ఎత్తుల తర్వాత డ్రాకు ఇరువురూ అంగీకరించారు. 6 గేమ్‌లు గుకేశ్, లిరెన్ తలా 3 పాయింట్లతో (ముందుగా 7.5 పాయింట్లకు చేరినవారు విజేతగా నిలుస్తారు) కొనసాగుతున్నారు.
కాగా మరో 8 గేమ్‌లు మిగిలున్న ఈ టోర్నీలో 8 మ్యాచ్‌ల తర్వాత ఇరువురికి సమాన పాయింట్లు ఉంటే అప్పుడు టై బ్రేక్ గేమ్స్‌కు అదనపు రోజును కేటాయించే అవకాశముంది. దాదాపు సగం దశకు చేరుకున్నప్పటికీ గుకేశ్, లిరెన్ ఇద్దరూ డ్రా లకు మొగ్గుచూపుతుండటంతో రాబోయే మ్యాచ్‌లలో పోరు మరింత రసవత్తరంగా ఉండటం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.