టెక్సాస్: మరికొన్ని గంటల్లో మైక్ టైసన్, జేక్ పౌల్ మధ్య బిగ్ బౌట్ జరగనున్నది. టెక్సాస్‌లో జరిగే ఆ ఫైట్‌పై అంతటా ఆసక్తి నెలకొన్నది. అయితే 33 ఏళ్ల ఇండియన్ బాక్సర్ నీరజ్ గోయత్(Neeraj Goyat).. ఆ మ్యాచ్‌పై భారీ బెట్టింగ్ పెట్టాడు. టైసన్‌పై సుమారు 8.4 కోట్ల విలువన ప్రాపర్టీలను బెట్టింగ్‌గా పెట్టాడు నీరజ్. టైసన్‌ను ఓడిస్తే ఆ ప్రాపర్టీ నీదే అని జేక్ పౌల్‌కు సవాల్ విసిరాడతను. ఆ ఛాలెంజ్‌ను పౌల్ స్వీకరించాడు. ఎక్కువ శాతం మంది బెట్టింగ్ రాయుళ్లు.. టైసన్ వైపే మొగ్గుచూపారు. ఫైనల్ రిజల్ట్ ఎవర్ని వరిస్తుందో వేచి చూడాల్సిందే.