న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక వరల్డ్ బాక్సింగ్ కప్లో భారత యువ బాక్సర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. బ్రెజిల్ వేదికగా జరుగుతున్న టోర్నీలో బాక్సర్ అభినాశ్ జమ్వాల్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల 65కిలోల సెమీస్ బౌట్లో అభినాశ్ 5-0 తేడాతో గియానుల్జి మలాంగ(ఇటలీ)పై అద్భుత విజయం సాధించాడు.
ఆది నుంచే తనదైన శైలిలో చెలరేగిన అభినాశ్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తన ఎత్తును అనుకూలంగా మలుచుకున్న జమ్వాల్ ప్రత్యర్థిపై పవర్ఫుల్ పంచ్లతో విరుచుకుపడ్డాడు.