తాష్కెంట్ : ఆసియా కప్ స్టేజ్-2 ఆర్చరీ ర్యాంకింగ్ టోర్నీలో కాంపౌండ్ విభాగంలో అన్ని పతకాలపై భారత ఆర్చర్లు కన్నేశారు. ఫైనల్ పోరుతోపాటు, కాంస్య పతక పోరులో ముగ్గురు భారత ఆర్చర్లు ఉండడంతో మూడు పతకాలు మనకే దక్కే అవకాశాలున్నాయి.
అభిషేక్ వర్మ స్వదేశానికే చెందిన అమిత్తో తలపడనుండగా, కుశాల్ దలాల్ కాంస్యం కోసం పోటీపడనున్నాడు.