IND vs AUS : నాలుగు రోజుల కిందటే వరల్డ్ కప్ ఫైనల్లో తలపడిన భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో తలపడుతున్నాయి. విశాఖపట్టణంలో జరుగుతున్నతొలి టీ20లో టాస్ గెలిచిన ఇండియాకెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ తీసుకున్నాడు. విజయంతో సిరీస్‌ను ఆరంభించాలనే కసితో ఉన్న భారత్ వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్, శివం మావిల స్థానంలో ప్రసిధ్, బిష్ణోయ్, ముఖేశ్‌లను ఆడిస్తోంది. వరల్డ్ కప్ హీరోలు మ్యాక్స్‌వెల్, హెడ్, జంపాకు ఆసీస్ విశ్రాంతినిచ్చింది. సాయంత్ర 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది
భారత్: యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్‌కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్(కెప్టెన్), తిలక్‌వర్మ, శివమ్‌దూబే, రింకూసింగ్, అక్షర్‌పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, ముకేశ్‌కుమార్.
ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(కెప్టెన్, వికెట్ కీపర్)), సియాన్ అబాట్, నాథన్ ఎల్లిస్, బెహెన్‌డార్ఫ్, తన్వీర్ సంగా.