కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు ప్లేయర్స్ వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచిన భారత్.. మూడో వన్డేలో భారీ మార్పులు చేసింది. మొత్తంగా ఆరు మార్పులు చేయగా.. అందులో ఐదుగురు తొలి వన్డే ఆడబోతున్నారు. నితీష్ రాణా, రాహుల్ చహర్, చేతన్ సకారియా, కే గౌతమ్, సంజు శాంసన్ అరంగేట్రం చేయనుండగా.. నవ్‌దీప్ సైనీ కూడా ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. అటు శ్రీలంక కూడా మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది.
Say Hello 👋🏻 to our 5 ODI debutants #TeamIndia #SLvIND
— BCCI (@BCCI) July 23, 2021
Congratulations boys 👏🏻👏🏻 pic.twitter.com/ouKYrtrW8G