శతక ధమాకా.. హర్మన్, దీప్తి సెంచరీలు
చిన్న జట్టు జింబాబ్వేను భారత అమ్మాయిలు మరోసారి కుమ్మేశారు. మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (121 బంతుల్లో 15 ఫోర్లతో 126), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (86 బంతుల్లో 15 ఫోర్లతో 106 నాటౌట్) సెంచరీల మోతకు స్పిన్నర్ వైష్ణవి శర్మ (4/39) బంతితో మ్యాజిక్ చేయడంతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 121 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది.
- మెరిసిన వైష్ణవి
- రెండో వన్డేలో భారత్ ఘన విజయం
- 2-0తో సిరీస్ సొంతం
- 121 పరుగుల తేడాతో జింబాబ్వే చిత్తు
వడోదర : చిన్న జట్టు జింబాబ్వేను భారత అమ్మాయిలు మరోసారి కుమ్మేశారు. మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (121 బంతుల్లో 15 ఫోర్లతో 126), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (86 బంతుల్లో 15 ఫోర్లతో 106 నాటౌట్) సెంచరీల మోతకు స్పిన్నర్ వైష్ణవి శర్మ (4/39) బంతితో మ్యాజిక్ చేయడంతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 121 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. ఓపెనర్ ప్రతికా రావల్ (67) కూడా మెరవడంతో తొలుత భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 328/6 భారీ స్కోరు సాధించింది. ఛేదనలో జింబాబ్వే 48.5 ఓవర్లలో 207 రన్స్‌కే కుప్పకూలింది. ఓపెనర్ ముపచిక్వా (49), ముగెరి తిరిపనో (46) కాస్త పోరాడారు. దీప్తి శర్మ (3/35) మూడు వికెట్లు తీసింది. హర్మన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మూడో, చివరి వన్డే బుధవారం జరుగుతుంది.
హర్మన్, దీప్తి జోరు
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ మంధాన (0) సిబాండ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ రెండో బంతికే ఫిరికి క్యాచ్ ఇచ్చి ఔటవగా.. గత మ్యాచ్‌లో మెరుపు ఫిఫ్టీ కొట్టిన వన్‌డౌన్ బ్యాటర్ షఫాలీ వర్మ (8) సైతం నిరాశపరిచింది. సిబాండ బౌలింగ్‌లోనే ఆమె కూడా వెనుదిరగడంతో భారత్ 19/2తో నిలిచింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యతను హర్మన్, తొలి మ్యాచ్ సెంచరీ హిట్టర్ ప్రతికా రావల్ తీసుకున్నారు. పవర్ ప్లేలో ఇద్దరూ క్రమం తప్పకుండా బౌండరీలు కొట్టారు. తొలుత 57 బంతుల్లో ప్రతికా అర్ధ శతకం పూర్తి చేయగా.. హర్మన్ 51 బంతుల్లో ఈ మార్కు దాటింది. రెండు సిక్సర్లతో దూకుడు పెంచి శతకం దిశగా సాగుతున్న ప్రతికాను 23వ ఓవర్లో న్యాషా ఔట్ చేయడంతో మూడో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం విడిపోయింది. తర్వాతి ఓవర్లోనే తేజల్ హసబ్నిస్ (3) ఒలిండర్ పెవిలియన్ చేర్చడంతో భారత ఇన్నింగ్స్ మళ్లీ తబడినట్టు కనిపించింది. తర్వాతి ఓవర్లో హర్మన్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను నొకొమో డ్రాప్ చేసింది.
ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకున్న హర్మన్ ప్రత్యర్థికి ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. తన మార్కు కవర్ డ్రైవ్‌లు, కట్ షాట్లతో అభిమానులను అలరిస్తూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. కెప్టెన్సీ భారం లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడిన కౌర్‌కు ఆల్ రౌండర్ దీప్తి శర్మ తోడవ్వడంతో భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దీప్తి కూడా బౌండరీలు కొట్టేందుకు మాజీ కెప్టెన్‌తో పోటీపడింది. తను టీ20 స్టయిల్లో ఆడి ఆడి 37 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. బిజా వేసిన 41వ ఓవర్లో డబుల్‌తో హర్మన్ తన కెరీర్లో 8వ వన్డే శతకాన్ని (101 బంతుల్లో) పూర్తి చేసుకుంది. సెంచరీ తర్వాత హర్మన్ ఇచ్చిన మరో రెండు క్యాచ్‌లను ఫీల్డర్లు నేలపాలు చేయడం జింబాబ్వేను దెబ్బతీసింది. చివరకు 47వ ఓవర్లో మవుంగ వేసిన స్లో ఫుల్లర్ డెలివరీకి హర్మన్ లాంగాఫ్‌లో క్యాచ్ ఇవ్వడంతోనాలుగో వికెట్‌కు ఏకంగా 153 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రిచా ఘోశ్ (7) ఫెయిలైనా.. తన దూకుడు కొనసాగించిన దీప్తి చివరి ఓవర్లో రెండు ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టుకు భారీ స్కోరు అందించింది.
వైష్ణవి మ్యాజిక్
భారీ ఛేదనలో జింబాబ్వే ఏ దశలోనూ భారత్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. ఓపెనర్ ముపచిక్వా పోరాడినా.. మరో ఓపెనర్ లోరైన్ ఫిరి (6) తడబడింది. తొమ్మిదో ఓవర్లో ఆమెను ఔట్ చేసిన తెలుగు స్పిన్నర్ శ్రీచరణి ప్రత్యర్థి పతనం ఆరంభించింది. ఈ దశలో ముపచిక్వాకు తోడైన తిరిపనో రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించి భారత బౌలర్లను విసిగించింది. కానీ, 23వ ఓవర్లో సయాలీ సత్ఘారే అద్బుతమైన బంతితో ఆమెను బౌల్డ్ చేసి భారత్‌కు కీలక బ్రేక్ ఇచ్చింది. ఇక్కడి నుంచి వైష్ణవి మాయ మొదలైంది. 28వ ఓవర్లో ముపచిక్వాను పెవిలియన్ చేర్చిన ఆమె కాసేపు ప్రతిఘటించిన బిజ్వా (34)తో పాటు మవుంగా (3), జోసెఫిన్ నకొమో (20)ను తన వరుస ఓవర్లలో వెనక్కుపంపి భారత్‌కు ఘన విజయం ఖాయం చేసింది. బ్యాట్‌తో శతకబాదిన దీప్తి చివర్లో తన స్పిన్ మ్యాజిక్ చూపెట్టింది. 46వ ఓవర్లో వరుస బంతుల్లో న్యాషా (20), సిబండా (0)ను ఔట్ చేసిన తన తర్వాతి ఓవర్లో మకుషా (0) పని కూడా పట్టింది. జింతిమణి కలిత బౌలింగ్‌లో దురురు (12) ఆఖరి వికెట్‌గా సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ హర్లీన్‌కు క్యాచ్ ఇవ్వడంతో జింబాబ్వే పోరాటం ముగిసింది.
8 వన్డేల్లో హర్మన్‌ప్రీత్‌కు ఇది 8వ సెంచరీ. భారత్ తరఫున ఈ ఫార్మాట్లో అత్యధిక శతకాలు చేసిన రెండో బ్యాటర్‌గా మిథాలీ రాజ్ (7)ను అధిగమించింది. మంధాన (14) అగ్రస్థానంలో ఉంది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 50 ఓవర్లలో 328/6 (హర్మన్ 126, దీప్తి 106 నాటౌట్, సిబాండ 2/38);
జింబాబ్వే: 48.5 ఓవర్లలో 207 ఆలౌట్ (ముపచిక్వా 49, ముగెరి 46, వైష్ణవి 4/39, దీప్తి 3/32)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

